Akash Puri: చిరంజీవితో సినిమా కోసం నాన్నతో గొడవ.. ఆకాష్ పూరి క్రేజీ కామెంట్స్

Akash Puri: చిరంజీవితో సినిమా కోసం నాన్నతో గొడవ.. ఆకాష్ పూరి క్రేజీ కామెంట్స్

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) తనయుడు ఆకాష్ పూరి(Akash Puri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఆ తరువాత ఆంధ్రపోరి సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించకపోవడంతో తన తండ్రితో కలిసి మెహబూబా సినిమా చేశాడు. కానీ, ఆ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగలడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల ఆకాష్ పూరి ప్రముఖ క్లోతింగ్ బ్రాండ్ ఆర్‌.సి.ట్రెండ్‌ సెట్టర్స్‌కి బ్రాండ్ అంబాసీడర్ గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తన సినిమాల గురించి, నాన్న పూరి జగన్నాధ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ లో భాగంగా ఒక విలేఖరి చిరంజీవి, పూరి జగన్నాధ్ ల కాంబోలో సినిమా గురించి ఆకాష్ ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఆకాష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే ఒక దేవుడిలాగా. నాన్న, చిరంజీవి కాంబోలో సినిమా కోసం మీకన్నా ఎక్కువగా నేను వెయిట్ చేస్తున్నాను. నాన్న రాసిన డైలాగ్స్ చిరు గారి నోటినుండి వినాలనేది నా కోరిక. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akash Puri (@actorakashpuri)

చాలా కాలంగా ఈ కాంబోలో సినిమా వస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కథలు కూడా సిద్డంగా ఉన్నాయి. ఈసారి నాన్నతో గొడవపడైనా సరే చిరంజీవి గారితో సినిమా చేయిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్. ప్రస్తుతం ఆకాష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి మెగా ఫ్యాన్స్ కూడా పాజిటీవ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి ఆకాష్ పూరి ఇన్వాల్మెంట్ తో అయినా చిరు, పూరి కాంబోలో సినిమా ఒకే అవుతుందా అనేది చూడాలి.