Sreemukhi: ఆ ఒక్క మాట చెప్పవా.. శ్రీముఖికి ఇంటర్ విద్యార్థి రిక్వెస్ట్

Sreemukhi: ఆ ఒక్క మాట చెప్పవా.. శ్రీముఖికి ఇంటర్ విద్యార్థి రిక్వెస్ట్

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ యాంకర్స్ లలో ఒకరు శ్రీముఖి(Sreemukhi). తనదైన మాటలతో ఆడియన్స్ ను అలరించడం ఆమె స్పెషాలిటీ. ఈవెంట్ ఐనా, టీవీ షో ఐనా తన చలాకి మాటలతో ఎంటర్టైన్ చేయడం ఆమె టాలెంట్. అందుకే ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈక్రమంలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆ ఫ్యాన్స్ బేస్ తోనే బిగ్ బాస్ కు సైతం వెళ్లి రన్నరప్ గా నిలిచారు. ఇక కేవలం యాంకరిగే కాకుండా..  సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు శ్రీముఖి. ఇటీవల వచ్చిన భోళా శంకర్ లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటో షూట్ ను పోస్ట్ చేశారు. బ్లూ కలర్ లెహంగాలో ఉన్న శ్రీముఖి ఫొటోస్ సెక్సీ లెవల్లో ఉండటంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ కు శ్రీముఖి అభిమాని ఒకరు క్రేజీ కామెంట్ చేశాడు. ఇంటర్ చదువుతున్న ఆ అభిమాని.. శ్రీముఖి అక్క మీ ఫొటోషూట్ చాలా బాగుంది. బ్లూ కలర్ డ్రెస్ లో చాలా బాగున్నారు. ఇప్పుడు నాకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పావా ప్లీజ్.. అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ అభిమానికి శ్రీముఖి రిప్లయ్ ఇస్తుందా అనేది చూడాలి.