తెలుగులో రీమేక్ అవుతున్న ఓ మైగాడ్2.. శివుడి పాత్రలో సీనియర్ హీరో?

తెలుగులో రీమేక్ అవుతున్న ఓ మైగాడ్2.. శివుడి పాత్రలో సీనియర్ హీరో?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay kumar) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ ఓ మైగాడ్‌-2(OMG2). ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా  భారీ విజయాన్ని దక్కించుకుంది. ఓ మైగాడ్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకే బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మొదటి పార్ట్ లో లాగే సీక్వెల్ లో కూడా ఒక సామాజిక అంశాన్ని చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు. పాఠశాల విద్యార్థుల్లో లైంగిక విజ్ఞానం అవశ్యకతను తెలియజెప్పే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలో కూడా రిలీజైన ఈ సినిమా గురించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓ మైగాడ్2 సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ రీమేక్ లో టాలీవుడ్ నుండి ఓ సీనియర్ హీరో నటించనున్నారని సమాచారం. అయితే ఆ సీనియర్ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. 

గతంలో కూడా ఓ మైగాడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. గోపాల.. గోపాల(Gopala gopala) టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్(Pawan kalyan), వెంకటేష్(Venkatesh) ప్రధాన పాత్రల్లో కనిపించాడు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన ఓ మైగాడ్2 సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. మరి ఈ సినిమాలో దేవుడిగా కనిపించనున్న ఆ సీనియర్ హీరో ఎవరు? ఎప్పుడు మొదలు కానుంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.    


ALSO READ: సలార్ దెబ్బకి డంకీ ఔట్.. షారుఖ్ మూవీ పోస్ట్పోన్?

 ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వెలువడింది. ఈ మేరకు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తు్న్న మూవీని త్వరలో తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ రీమేక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడని, ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కాగా హిందీ బాక్సాఫీస్‌ వద్ద రూ.150కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రీమేక్‌కు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.