సలార్ దెబ్బకి డంకీ ఔట్.. షారుఖ్ మూవీ పోస్ట్పోన్?

సలార్ దెబ్బకి డంకీ ఔట్.. షారుఖ్ మూవీ పోస్ట్పోన్?

ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ అంటూ కొన్ని రోజులుగా సలార్(Salaar), డంకీ(Dunki) గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం  ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న సలార్, షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వస్తున్నా డంకీ సినిమాలు ఒకేరోజు(డిసెంబర్ 22) రిలీజ్ కావడమే. దీంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. మా హీరో మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటే.. మా హీరో మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేసుకున్నారు.

Also Read : పల్లవి ప్రశాంత్ వల్ల నేను టార్గెట్ అయ్యాను.. దారుణమైన కామెంట్స్ చేశారు

నిజానికి ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్(KGF) తరువాత ప్రశాంత్ నీల్(Prashanth neel), ప్రభాస్ కాంబో వస్తుండటంతో సలార్ పై, పఠాన్(Pataan), జవాన్(Jawan) వంటి ఇండస్ట్రీ హిట్స్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో డంకీ పై నెక్స్ట్ లెవల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాలు ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలుస్తాయనేది ఆయా ఇండస్ట్రీల నుండి వినిపిస్తున్న మాట. మరి ఒకేరోజు రిలీజైతే ఏ హీరో రేంజ్ ఏంటి అని లెక్కలు మొదలవుతాయి.    

అందుకే ఈ బిగ్గెస్ట్ క్లాష్ నుండి షారుఖ్ ఖాన్ డంకీ మూవీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. డంకీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చాలావరకు పెండింగ్ లో ఉన్నాయట. డిసెంబర్ 22లోపు ఆ పని కంప్లీట్ అవడం కష్టమే అని అంటున్నారు. ఆ కారణంగా కూడా డంకీ సినిమా పోస్ట్ పోన్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఏ హీరో సినిమాకు ఎఫెక్ట్ కాకుండా ఉండేలా డంకీ మూవీని పోస్ట్ పోన్ చేయడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.