
మలయాళంలో తెరకెక్కే సినిమాలకు తెలుగులో మంచి ఫాల్లోవింగ్ ఉంది. మరి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అక్కడి సినిమాలకు మనవాళ్ళు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక ఏడాది ముందువరకు.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ తెలుగు ఆడియన్స్.. ఇప్పుడు కామెడీ మూవీస్కు కూడా అట్ట్రాక్ట్ అవుతున్నారు.
ఎందుకంటే, మలయాళ దర్శకులు ఎంచుకునే కాన్సెప్ట్స్ లోనే సహజత్వం దాగుంటుంది. కథలో ప్రతిఒక్కరూ లీనమయ్యేలా ఎలిమెంట్స్ రాసుకుంటున్నారు. అలా వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.
ఇటీవలే టూరిస్ట్ ఫ్యామిలీ వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇపుడు అలాంటి ఓ స్పోర్ట్స్ కామెడీ థ్రిల్లర్.. ఈ ఏడాది థియేటర్స్కి వచ్చి బ్లాక్‌బస్టర్ అందుకుంది. అదే.. ఆలప్పుళ జింఖానా (AlappuzhaGymkhana). ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్లకి పైగా వసూళ్లు చేయడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఓ లుక్కేద్దాం.
The Gymkhana gang is here to win hearts ♥️📷Watch #AlappuzhaGymkhana Streaming Now On SonyLIV #AlappuzhaGymkhanaOnSonyliv #Naslen #Lukeman #GanapathiSP #Zandeep #anagharavi #djangospace #SonyLIVSouthhttps://t.co/VSS3Obf4j2 pic.twitter.com/aa7qjcwWFr
— Sony LIV (@SonyLIV) June 12, 2025
జింఖానా ఓటీటీ:
ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన జింఖానా మూవీ.. గురువారం (జూన్ 12న) ఓటీటీలోకి వచ్చి దుమ్మురేపుతోంది. ఈ సినిమా సోనీ లివ్ (Sony Liv) ప్లాట్ ఫామ్ లో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
►ALSO READ | Sunjay Kapur: విమాన ప్రమాదంపై స్పందించిన గంటల్లోనే.. ఓ తేనెటీగ వల్ల సంజయ్ కపూర్ మృతి!
“మీ హృదయాలను గెలవడానికి జింఖానా గ్యాంగ్ వచ్చేసింది. ఆలప్పుళ జింఖానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది”అనే క్యాప్షన్తో మూవీ టీమ్ వెల్లడించింది. తెలుగులో అదిరిపోయే డైలాగ్స్ ఉండటంతో ఓటీటీ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకుంటుంది.
Trained hard and powered up. The Gymkhana boys are here to own your screens.
— Sony LIV (@SonyLIV) June 13, 2025
Watch #AlappuzhaGymkhana streaming now SonyLIV #AlappuzhaGymkhanaOnSonyLIV#Naslen #Lukeman #GanapathiSP #Zandeep #anagharavi #djangospace #SonyLIVSouthhttps://t.co/VSS3Obf4j2 pic.twitter.com/vtzjXD3jNQ
కథేంటంటే:
ఈ సినిమా ఐదుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), డేవిడ్ జాన్ (ఆబిష్ రెహమాన్), జోజో జాన్సన్ (నాస్లెన్), షానవాస్ కెఎల్ (శివ హరిహరన్) పన్నెండో తరగతి పరీక్షలు రాసి, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. రిజల్ట్స్ వచ్చేరోజు ఒక టేబుల్ చుట్టూ గుమిగూడి, మధ్యలో కల్లు కుండని పెట్టుకుంటారు. పాసైనా, ఫెయిల్ అయినా తాగడమే వాళ్ల పని. రిజల్ట్స్ చూసుకుంటే షానవాస్ తప్ప మిగతావాళ్లంతా ఫెయిల్ అవుతారు.
పై చదువులకు వెళ్లాలంటే వాళ్ల ముందున్న మార్గం ఒకటే.. స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో చేరడం. అందుకే గ్రేస్ మార్కులు సాధించడానికి బాక్సింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. దాంతో వాళ్లంతా బాక్సర్లుగా మారడానికి ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? బాక్సింగ్ పోటీల్లో గెలిచి కాలేజీలో చేరారా? లేదా? అనేది మిగతా కథ.