టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ రూట్ మార్చారు. గత కొంత కాలంలో సీరియస్, ఎమోషనల్ పాత్రలతో మెప్పించిన ఈ ఆల్ రౌండర్ .. మళ్లీ తన కామెడీ తో ప్రేక్షకులలో పూనకాలు తెప్పించేందుకు రెడీ అయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇస్తూ.. నరేష్ కెరీర్లోనే మైల్స్టోన్ అనదగ్గ 65వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి 'రంభ ఊర్వశి మేనక' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు.
కామెడీ కింగ్ ఈజ్ బ్యాక్..
ఈ మూవీకి 'కామెడీ గోస్ కాస్మిక్' అనే ట్యాగ్‌లైన్ పెట్టడం సినిమాపై అంచనాలను పెంచేసింది. 'యముడికి మొగుడు' వంటి సూపర్ హిట్ తర్వాత దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం నరేష్ మళ్లీ సోషియో ఫాంటసీ జానర్ వైపు అడుగులు వేస్తున్నారు. అటు ఫ్యాన్స్ కూడా కామెడీ కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కామెడీ వండర్ సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది
ఫస్ట్ లుక్ అదిరింది బాసూ..
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆకాశంలో మేఘాల మధ్య దేవలోకానికి వెళ్లే మెట్లపై నరేష్ ఎంతో స్టైలిష్‌గా కూర్చుని, చేతిలో ముగ్గురు దివ్య సుందరీమణులైన రంభ, ఊర్వశి, మేనక పేర్లు రాసి ఉన్న ఒక పురాతన శాసనాన్ని పట్టుకుని కనిపిస్తున్నారు. చుట్టూ అప్సరసలు విహరిస్తుంటే.. నరేష్ మాత్రం ఆ ముగ్గురి గురించే ఆలోచిస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, భూలోకానికి ఇంద్రలోకానికి మధ్య జరిగే ఒక మాయాజాలం, అందులో నుంచి పుట్టే కడుపుబ్బ నవ్వించే కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరనేది సస్పెన్స్‌గా ఉంచి మేకర్స్ క్యూరియాసిటీని మరింత పెంచేశారు.
►ALSO READ | OTT Review: కాంతార, విరూపాక్ష తరహాలో మరో మైథలాజికల్.. ‘తవ్వై’ ఓటీటీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
క్రేజీ కాంబినేషన్స్..
దర్శకుడు చంద్ర మోహన్ చింతడ ఈ చిత్రాన్ని సరికొత్త వినోదభరితమైన స్క్రిప్ట్‌తో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. న్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో.. హాస్య మూవీస్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి టాప్ కామెడీ కింగ్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ తన కామెడీ టైమింగ్ తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
#RambhaVoorvasiMenaka
— devipriya (@sairaaj44) June 30, 2026
సెప్టెంబర్ 4 విడుదల pic.twitter.com/hl9riq3Npn
