సీత జాతకం చెప్పిన అల్లు అరవింద్.. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరో?

సీత జాతకం చెప్పిన అల్లు అరవింద్.. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరో?

నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సీతారామం(Sitaramam) హిట్ తరువాత ఆమెకు టాలీవుడ్ నుండి ఆమెకు వరుస ఆఫర్స్ అందుతున్నాయి. ఇప్పటికే నాని(Nani)తో హాయ్ నాన్న(Hi Nanna) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో ఫ్యామిలీ స్టార్(Family star) అనే సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు నెల రోజుల  గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవే కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది ఈ బ్యూటీ. అందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూడా ఉన్నట్లుగా సమాచారం. 

Also Read : ఎలిమినేటైనా గట్టిగానే వెనకేసుకున్నాడు.. వైరల్ అవుతున్న సందీప్ రెమ్యునరేషన్

ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవవింద్ మృణాల్ పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ లో సీతారామం సినిమాకు గాను మృణాల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు మృణాల్ కు అందించిన అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను మృణాల్ గురించి ఒక విషయం చెప్పాలి. ఆమె తన కాబోయే వాడిని సెలెక్ట్ చేసుకుంది. గతంలో నేను ఒక హీరోయిన్ ను బ్లెస్స్ చేశాను.. ఆమె ఒక హీరోను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. నువ్వు కూడా హైదరాబాద్ రావాలని నేను కోరుకుంటున్నాను.. అని అన్నారు అల్లు అరవింద్. 

దీంతో మృణాల్ కూడా హైదరాబాద్ కోడలిగా మారనుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్ నిజమై మృణాల్ కూడా హైదరాబాద్ కోడలు కానుందా? ఇంతకీ మృణాల్ సెలెక్ట్ చేసుకున్న ఆ టాలీవుడ్ హీరో ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.