ఎలిమినేటైనా గట్టిగానే వెనకేసుకున్నాడు.. వైరల్ అవుతున్న సందీప్ రెమ్యునరేషన్

ఎలిమినేటైనా గట్టిగానే వెనకేసుకున్నాడు.. వైరల్ అవుతున్న సందీప్ రెమ్యునరేషన్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో అప్పుడే ఎనిమిది వారాల ఆట ముగిసింది. గత ఏడు వారాలుగా అందరు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్న వేల.. ఎనిమిదవ వారానికి గాను మొదటి మేల్ కంటెస్టెంట్ సందీప్(Sandeep) ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. సీజన్ మొదలైనప్పటి నుండి సందీప్ ఒక్కసారి కూడా నామినేషన్ లో లేడు. మొదటిసారి నామినేషన్ లోకి వచ్చాడు.. అది కూడా ఒక్కరే నామినేట్ చేశాడు.. కానీ ఇంటినుండి బయటకు వచ్చేశాడు.

Also Read: బంగారం దొంగగా కార్తి

 అయితే.. హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పటికీ సందీప్ బాగానే సంపాదించాడట. నిజానికి ఆట డాన్స్ షో ద్వారా సందీప్ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ కారణంగానే సందీప్ కు మంచి రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట బిగ్ బాస్ మేకర్స్. ఒక్కో వారానికి రూ.2.5 లక్షల చొప్పున ఎనిమిది వారాలకు గాను ఏకంగా రూ.20 లక్షల వరకు రెమ్యునరేషన్ గా అందుకున్నాడట సందీప్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.