బంగారం దొంగగా కార్తి

బంగారం దొంగగా కార్తి

కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జపాన్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, జయం రవి, హీరోయిన్ తమన్నా, దర్శకులు లోకేష్ కనకరాజ్, పా. రంజిత్ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో కార్తి డిఫరెంట్ గెటప్‌‌‌‌లో కనిపించడమే కాకుండా, డిఫరెంట్ వాయిస్‌‌‌‌ మాడ్యులేషన్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తి) చిన్నప్పుడే తన తల్లి కోసం బంగారం  దొంగగా మారినట్టుగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో చూపించారు. ‘బుల్లి చేప.. అమ్మ చేప కోసం ఓ కన్నెం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట’ అంటూ తన క్యారెక్టర్‌‌ను కార్తి పరిచయం చేసుకోవడం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

‘సింహాం కాస్త సిక్ అయితే పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాశాయంటా’ అంటూ తను చెప్పిన డైలాగ్ ఇంప్రెస్ చేస్తోంది.  సునీల్‌‌‌‌ కీలక పాత్రలో కనిపించాడు. యాక్షన్ సీన్స్‌‌‌‌తో పాటు జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రాఫర్  విజయ్ మిల్టన్ ఈ చిత్రంతో నటుడిగా పరిచయమవుతున్నాడు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న  ఈచిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.