ప్రపంచవ్యాప్తంగా మిర్చి వినియోగం పెరుగుతుండటంతో భారత ఎగుమతులు గణనీయ వృద్ధి సాధించాయి. ఎగుమతుల పరిమాణం విలువ రెండింటిలోనూ పెరుగుదల నమోదు అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లలో మిర్చికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారత మిరప ఎగుమతులు లక్షల టన్నుల స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాల నుంచి అధిక ఆర్డర్లు వస్తున్నాయి. ప్రపంచ మిరప ఉత్పత్తిలో మన దేశం అగ్రగామిగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మిరప ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిర్చి ఉత్పత్తిదారు, వినియోగదారు ,ఎగుమతిదారు కూడా. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. ఇండియా తర్వాత బంగ్లాదేశ్, థాయిలాండ్, చైనా, ఇథియోపియా, మయన్మార్, పాకిస్తాన్ వంటి దేశాలు ఎక్కువగా మిర్చి ఉత్పత్తి చేస్తున్నాయి.
మన దేశంలో ఏడాది పొడవునా ఉత్పత్తికి మద్దతు ఇచ్చే విభిన్న వాతావరణ పరిస్థితులతో చాలా రాష్ట్రాలలో మిరపపంటను సాగు చేస్తారు. విస్తృత సాగు విస్తీర్ణం, అనుకూలమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు, ఎన్నో ఏళ్లుగా సుగంధ ద్రవ్యాల వ్యవసాయ పద్ధతులు భారతదేశం ప్రపంచ మిరప ఉత్పత్తిలో ముందంజలో ఉంది. భారతీయ వంటకాలలో మిరప ముఖ్యమైన పదార్థం. దీనికి నిరంతర డిమాండ్ ఉండటంతో వాణిజ్యపంటగా ఎగుమతి చేస్తారు. ప్రభుత్వ మద్దతు, నీటిపారుదల విస్తరణ ,మెరుగైన విత్తన రకాలు ఉత్పాదకతను మరింత బలోపేతం చేశాయి.
మిరప పండించే రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్‌తో మిర్చి పంటను పండించే రాష్ట్రాల్లో ముందు వరసలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తగిన ఉష్ణోగ్రతలు, సారవంతమైన నేల ,నీటిపారుదల మౌలిక సదుపాయాలు మిరప పంట సాగుకు దోహదం చేస్తాయి. ఆయా రాష్ట్రాల్లో వివిధ రకాల పచ్చి మిర్చి ని పండిస్తాయి.
మిరప సాగుకు అనువైన వాతావరణం, నేల
మిరప సాగుకు అనువైన నేలలు, వాతావరణం మన దేశంలో విస్తృతంగా ఉన్నాయి. మిరప సాగుకు వెచ్చని ఉష్ణోగ్రతలు, మోస్తరు వర్షపాతం, సారవంతమైన ఎర్ర నెలలు అవసరం. భారత దేశమంతటా ఉష్ణమండల, ఉపఉష్ణమండల వాతావరణ పరిస్థితులు మిరప అధిక దిగుబడిని అందిస్తాయి. సూర్యరశ్మీ, సరైన తేమ సమతుల్యత ఘాటు, దిగుబడి నాణ్యతను పెంచుతాయి.
మిరకాయల ఎగుమతి
ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా అంతటా అనేక దేశాలకు భారత్ మిరప ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఈ మసాలా సుగంధద్రవ్య వాణిజ్యంలో కీలక పాత్ర మిర్చిది. రైతు ఆదాయం, ఎగుమతుల ఆదాయాన్ని అందిస్తుంది. భారత్ నుంచి పొడులు ,సాస్‌లు వంటి ప్రాసెస్ చేసిన మిరప ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.
