వేల ఏండ్ల కింద కృష్ణుడు చెప్పిన గీత... ఇప్పటికీ ఎందుకు చదవమంటున్నరు? అసలు ఈ గీతలో ఇప్పటోళ్లకు అక్కెరకొచ్చే మాటలేమున్నయ్? అంటే.. చానా ఉన్నయ్. గీత చెప్పిన కొన్ని జీవిత పాఠాలు.. మన జర్నీని కంప్లీట్ గా మారేస్తయ్! గీతని అడాప్ట్ చేసుకుంటే మనమేంది? మన జీవితమేంది? అనే ప్రశ్నలకు ఆన్సర్ తెలుస్తది!
మార్పు సృష్టి నియమం అని గీత బోధిస్తుంది. మనకు ఫీలింగ్స్, ఎమోషన్స్ అభిప్రాయాలు ఉంటాయి. అయితే, 'మీరు మారాలి' అని మనకు ఎవరైనా చెప్తే ఆ సలహాని మనం సహజంగానే వ్యతిరేకిస్తుంటాం. కానీ, పరిస్థితులకు తగట్టుగా మారాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త సవాళ్లకు కొత్త మార్పునకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో విజయం సాధించగలమని గీత చెస్తోంది.
పని–ప్రతిఫలం
మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు.. దాని తాలూకు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఆలోచించడం వల్ల మనం బెస్ట్ ఇవ్వలేం. ప్రతిఫలాల మత్తులో ఉన్నప్పుడు ఏ పనీ సంపూర్ణంగా చేయలేం. ఇక పని చేశాక.. ఆశించిన ఫలితం రాకపోతే.. బాధపడతాం. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ పోవాలంటాడు కృష్ణుడు. చేసే పని, దాని ఫలితం మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అని మరో శ్లోకంలో అంటాడు శ్రీకృష్ణుడు. ఫలితంతో సంబంధం లేకుండా జీవితప్రయాణంలో సంతృప్తిని పొందడమే దీని ఉద్దేశం.
సరైన దృక్పథం
ప్రతి మనిషికి ఒక దృక్పథం ఉంటుంది. అయితే. అది సరైన దృక్పథం అయినప్పుడే.. మనశ్శాంతి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికిముందు అర్జునుడు గందరగోళంలో పడతాడు..
తాను చేయబోయే పనుల వల్ల కలిగే ఫలితాన్ని ఊహించుకుంటూ బాధపడతాడు. తన కుటుం బంతోనే యుద్ధం చేయాల్సి రావడాన్ని జీర్ణించుకో లేకపోతాడు. అప్పుడు, కృష్ణుడు చెప్పిన మాటలు ఆయన దృక్పథాన్ని మార్చి యుద్ధం వైపు నడిపిస్తా యి. అలాగే, మనం కూడా ఏం చేయాలి? ఏం చేస్తే ఏం జరుగుతుంది" అని తెలుసుకోగలిగితే మన ప్రవర్తనకీ, దృక్పథానికీ సరైన రూపం వస్తుంది.
జీవితం ఒక యుద్ధభూమి
'జీవితం ఒక యుద్ధభూమి లాంటిది. ధైర్యంగా పోరాడు' అంటాడు కృష్ణుడు. చుట్టూ గోడలు కూ లిపోతున్నా మన పాదాల కింద భూమి పగిలిపోతు న్నా దేనినీ ఆశించొద్దు. భయాలు, ఎక్స్పెక్టేషన్స్, మన అవకాశాలని దెబ్బతీస్తాయి.
పాజిటివ్ ఆలోచనలు
పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడే.. మనం కాన్పిడెం ట్ గా ఉండగలుగుతాం. ఇది ప్రతికూల భావాలను అధిగమించడానికి సాయపడుతుంది. లక్ష్యానికి ఒక దారి చూపిస్తుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవ దానికి ప్రిపేర్ చేస్తుంది. అందుకే, "కృతజ్ఞతా భావంతో ఉండాలి ధ్యానం చేయాలి? అని గీత చెప్తాంది. పాజిటివ్ విషయాలు చదవడం. పాజిటివ్ మనుషులతో గడపడం వల్ల ఆలోచనలు కూడా పాజిటివ్ గా మారతాయి.
పెద్ద కలలు
కల కచ్చితంగా నిజమవుతుంది. అయితే అందులోనూ 'డ్రీమ్ బిగ్' ని ఫాలో కావాలని గీత
చెస్తోంది. పెద్ద కలలు కనడానికి భయపడ కూడదు. సందేహపడకూడదు. కలలకు తగ్గ ట్టుగా కష్టపడితే అవి నిజమవుతాయి. మనల్ని నాశనం చేసే చిన్నచిన్న గోల్స్ పెట్టుకోకూడదు. ఇవి మన ఫోకస్‌ని మళ్లించి.. మనం ఓడిపోయేలా చేస్తాయి.
కోరికలు వస్తాయి. పోతాయి..!
మనిషికి కోరికలు సహజం! అయితే, వాటిని అణచివేయాలని చూడకూడదు. మన జీవి తాన్ని, మనసుని కంట్రోల్ చేసే అవకాశం కోరికలకు ఇప్పకూడదు. సినిమా షో చూస్తూ ఎంజాయ్ చేసినట్టు కోరికల్ని కూడా చూసి వదిలేయాలని భగవద్గీత చెపింది. 'పొగవల్ల, ధూళి వల్ల అద్దం మావి వల్ల గర్భంలో ఉన్న పిండం కప్పబడి ఉన్నట్టే కోరికల వల్ల జ్ఞానం కూడా కప్పబడి ఉంటుంది' అని వివరిస్తోంది. కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం.. చెడు కర్మలు చేయకూడదు. కోరికల గొలుసులో చిక్కుకోవడం వల్ల కలిగే ఫలితం ఒత్తిడితో మన శ్శాంతి లేకుండా పోతుంది.
అందరికోసం పని చేయాలి
చాలామంది తమ స్వార్థం కోసమే పనులు చేస్తుంటారు. ఇతరుల కోసం బాధపడటం, పనులు చేయడం చాలా అరుదు. మనం ఇతరుల సమస్యల గురించి పట్టించుకోవడం చాలా తక్కువ. భగవద్గీత 'వసుధైక కుటుంబం' గురించి బోధించింది. మన చుట్టూ ఉన్నవాళ్లం తా మన కుటుంబమే అన్న భావన నిస్వార్థం వైపు నడిపిస్తుంది. అప్పుడు మనం చేసే పసులు.. మనల్ని మెరుగైన స్థానంలో నిలబెట్టే లా ఉంటాయి. దీనికోసం మన చుట్టూ ఉండే మనుషులతో మంచి అనుబంధం ఏర్పరచుకో
వడం చాలా ముఖ్యం.
కోపం వద్దు
కోపం మనల్ని నాశనం చేస్తుందని తెలుసు... కానీ, చాలామంది దాన్ని కంట్రోల్ చేసుకోవ డంలో ఫెయిల్ అవుతుంటారు. కోపం పల్ల ఆలోచనల్లో క్లారిటీ లోపిస్తుంది. ఏ పని మీదా పోకస్ పెట్టలేకపోతాం. కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు. మతిమరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషి నాశనం" అంటాడు గీతలో కృష్ణుడు. కోపంవల్ల చివరికి ఆ కోప్పడ్డ మనిషే నాశనమవుతాడు. మహాభారతంలో దుర్యోధనుడి కోపమే. తన సోదరులైన పాండవులపై యుద్ధం చేయడానికి ఉసిగొల్పుతుంది.
భయం ఎందుకు?
'భయం అనేది ప్రతి జీవిలో ఉండే ప్రాథమిక భావోద్వేగం' అని గీతలో ఉంది. అయితే, ఎమో షన్ ని మేనేజ్ చేసే జ్ఞానం లేకపోవడంవల్లే మనుషులు నిత్యం భయపడుతుంటారు. జ్ఞానం పొండడానికి ప్రయత్నం చేయడమే భయం నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం. తెలియని వాటి గురించి తెలుసుకుని, అర్ధం చేసుకోవడంవల్లే భయాన్ని అధిగమించగలం!
