డ్రగ్ మాఫియా మరోసారి విజృంభించింది. మెడికల్ షాపులో డ్రగ్స్ అమ్మకాలపై ప్రశ్నించినందుకు లైవ్ కెమెరా ముందే కాల్పులకు తెగబడింది. గన్ చేతిలో పట్టుకుని యాక్టివిస్టులను వెంబడించిన తీరు రౌడీయిజానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నట్లుగా మారింది. 2026 అక్టోబర్ 23న పంజాబ్ లో జరిగిన లైవ్ మర్డర్ ఆ రాష్ట్రాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లో డ్రత్స్ నిర్మూలనకై కృషి చేస్తున్న పర్విందర్ సింగ్ ఝోతా హత్యకు గురయ్యారు. మన్సాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న క్యాంపెయిన్ లో భాగంగా.. మెడికల్ షాపులో డ్రగ్స్ పై ప్రశ్నించినందుకు సినిమాలో విలన్ మాదిరిగా గన్ తీసి నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి పారేశారు. ఝోటాను మన్సాలోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
గత కొన్నేళ్లుగా పంజాబ్ లో మెడికల్ స్టోర్స్ వేదికగా జరుగుతున్న డ్రగ్ దందాపై పర్వీందర్ సింగ్ గళం విప్పుతూ వస్తున్నారు. మెడికల్ షాపులలో హెరాయిన్, మత్తు గోలీలు, పిల్స్ లు అమ్ముతున్నట్లు ఆరోపిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ అమ్మకంపై యుద్ధం చేస్తూనే ప్రజల్లో అవగాహన కోసం కఋషి చేస్తున్నారు.
మంగళవారం (అక్టోబర్ 13) ఉదయం.. డ్రగ్స్ కలిగిఉన్న ఒక వ్యక్తిని కలిసిన ఝోట.. ఎక్కడ కొన్నావని ప్రశ్నించగా మెడికల్ షాపు గురించి చెప్పాడు. దీంతో అతడిని మెడికల్ స్టోర్ కు తీసుకెళ్లి.. నిషేధించిన పధార్థాలను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. చిన్న పాటి వాదన తర్వాత జేబులో నుంచి గన్ తీసి షూటింగ్ స్టార్ట్ చేశాడు మెడికల్ షాప్ ఓనర్.
#Mansa anti-drug activist Parvinder Singh Jhota shot dead by a medical shop owner when he confronted him over alleged sale of banned pills. Incident took place when Jhota was doing live on his Facebook and shop owner can be seen opening fire. #Antidrug #Punjab #ParvinderJhota https://t.co/bli0PUNwE7
— Parteek Singh Mahal (@parteekmahal1) October 13, 2026
బుల్లెట్ గాయం అయ్యాక ఝోటా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఝోటాపై కాల్పులు జరిపిన వ్యక్తిని అశ్వనీ కుమార్ గా గుర్తించారు. షాప్ ఓనర్, షాప్ కీపర్లను గుర్తించామని.. తొందర్లోనే పట్టుకుంటామని బతిండా డీఐజీ హర్జిత్ సింగ్ తెలిపారు.
👉ਮਾਨਸਾ 'ਚ ਮੈਡੀਕਲ ਸਟੋਰ ਮਾਲਕ ਨੇ ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ 'ਤੇ ਫਾਇਰ ਕੀਤੇ, ਫਿਰ ਪਿਸਤੌਲ ਲਹਿਰਾਉਂਦਾ ਹੋਇਆ ਸ਼ਰੇਆਮ ਬਾਜ਼ਾਰ 'ਚ ਘੁੰਮਦਾ ਰਿਹਾ, ਲਗਾਤਾਰ ਗੋਲੀਆਂ ਚਲਾਉਂਦਾ ਰਿਹਾ ਅਤੇ ਹਰ ਪਾਸੇ ਦਹਿਸ਼ਤ ਫੈਲਾਉਂਦਾ ਰਿਹਾ। 👉ਝੋਟਾ ਉਸਦੀ ਦੁਕਾਨ ਦੇ ਅੰਦਰ ਪਿਆ ਤੜਫਦਾ ਰਿਹਾ, ਰੋਕਣ ਵਾਲਾ ਕੋਈ ਨਹੀਂ ਸੀ। 👉ਇਸ ਤੋਂ ਅੰਦਾਜ਼ਾ ਲਗਾ ਲਓ, ਗੁਰੂ ਦੋਖੀ ਦੇ ਰਾਜ ਵਿੱਚ ਪੰਜਾਬ 'ਚ ਕਾਨੂੰਨ-ਵਿਵਸਥਾ ਕਿਸ ਪਾਸੇ ਜਾ ਰਹੀ ਹੈ! 👉 मानसा में मेडिकल स्टोर मालिक ने परविंदर झोटा पर फायर किए, फिर पिस्तौल लहराता हुआ सरेआम बाजार में घूमता रहा, लगातार गोलियां चलाता रहा और हर तरफ दहशत फैलाता रहा। 👉 झोटा उसकी दुकान के अंदर पड़ा तड़पता रहा, रोकने वाला कोई नहीं था। 👉 इससे अंदाजा लगा लो, गुरु-द्रोही के राज में पंजाब में कानून-व्यवस्था किस तरफ जा रही है! 👉 In Mansa, a medical store owner allegedly opened fire on Parvinder Jhotta, then roamed openly through the market, brandishing his pistol, firing repeatedly and spreading terror everywhere. 👉 Jhotta lay writhing in pain inside the shop, with nobody stepping in to stop the attack. 👉 This gives a glimpse of the state of law and order in Punjab under the rule of “Guru Dokhi”. Where is the state heading?
— Bikram Singh Majithia (@bsmajithia) October 13, 2026
