దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 750 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ చెప్పారు. రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు సొంతూర్లకు వెళ్లే వారి కోసం బుకింగ్ఆప్షన్ ఇచ్చారు.
ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ ధర సాధారణ ఛార్జీల కంటే కొంతమేర ఎక్కువగానే ఉంటుంది. మూడో వంతు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. బస్సుల్లో కూడా రద్దీ పెరిగిపోవడంతో స్పెషల్ బస్సులను నడుపుతున్నారు.
స్కూళ్లు, కాలేజీలకు దసరా, బతుకమ్మ సెలవులు ఇవ్వడంతో స్టూడెంట్లంతా సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో.. జేబీఎస్, ఎంజీబీఎస్ప్రయానికులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ,పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, బాన్సువాడ, ఆసిఫాబాద్, మెదక్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్కిక్కిరిసింది.
రద్దీకి అనుగుణంగా అధికారులు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారం మీదకు బస్సు రాగానే సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు.
