ఔను వాళ్లిద్దరూ విడిపోయి మళ్లీ కలిసారొచ్చ్.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా– ఆకృతి అగర్వాల్!

ఔను వాళ్లిద్దరూ విడిపోయి మళ్లీ కలిసారొచ్చ్.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా– ఆకృతి అగర్వాల్!

Prithvi Shaw, Akriti Agarwal: భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw), నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) తమ వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన కొన్ని వారాల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒకటయ్యారు. తమ బంధాన్ని పునరుద్ధరించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా సోమవారం (అక్టోబర్ 12) రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, గతంలో తీసుకున్న తొందర పాటు నిర్ణయాన్ని సరిదిద్దుకుంటూ మళ్లీ కలిసి ప్రయాణించాలని అనుకుంటున్నట్లు తెలిపింది.  

మంది మాట విని తప్పు చేశా: ఆకృతి అగర్వాల్

తన నిశ్చితార్థం రద్దు నిర్ణయంపై ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇస్తూ.. పృథ్వీ షాతో మళ్లీ కలిసినట్లు వెల్లడించారు. ఈ పోస్ట్‌ను పృథ్వీ షా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నప్పుడు, నా చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల అభిప్రాయాల ప్రభావానికి లోనయ్యాను, మా బంధం గురించి మాకంటే వారికే ఎక్కువ తెలుసన్నట్లు వ్యవహరించిన వారి మాటలు విని నాకు కాబోయే భర్తను, మా సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.. మా మధ్య జరగాల్సిన నిజాయితీతో కూడిన సంభాషణ లేకుండానే నిర్ణయం తీసుకున్నాను.. ఆ తప్పుకు పూర్తి బాధ్యత నాదే.. ఆ తర్వాత మేమిద్దరం సమగ్రంగా మాట్లాడుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ ఒకటవ్వాలని ఫిక్స్ అయ్యామని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు.

►ALSO READ | జైలు నుంచి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ క్రికెటర్!

రంజీల్లో పృథ్వీ షా ధనాధన్ ఇన్నింగ్స్: 

వ్యక్తిగత జీవితంలోనే కాకుండా మైదానంలోనూ 26 ఏళ్ల పృథ్వీ షా తన ఫామ్‌ను తిరిగి పుంజుకునేందుకు కష్టపడుతున్నాడు. మహారాష్ట్ర రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-ఎ పర్యటనలో ఉండటంతో, రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌కి పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీలోని పాలమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా.. కేవలం 73 బంతుల్లో 70 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) బాది జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా, గత రంజీ సీజన్‌లో చండీగఢ్‌పై 222 పరుగుల ద్విశతకంతో రాణించినప్పటికీ టీమిండియా రీ-ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.