Tilak Varma: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా వెస్టిండీస్‌తో రేపు (అక్టోబర్ 14, 2026, బుధవారం) జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, లోకల్ బాయ్ తిలక్ వర్మ (Tilak Varma) విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. సొంతగడ్డపై మ్యాచ్ ఆడటం, పిచ్ పరిస్థితులు, తన బ్యాటింగ్ స్థానం, మూడో టీ20లో జరిగిన విచిత్రమైన రనౌట్ ఘటనపై తిలక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి:
ఉప్పల్ గ్రౌండ్లో సాధారణంగా ఫ్లాట్ వికెట్ ఉంటుందని, అయితే ఈసారి పిచ్ స్వభావాన్ని మార్చారని ప్రచారం జరుగుతోందని తిలక్ వర్మ తెలిపాడు. కానీ ఈసారి పిచ్‌లో మార్పులు చేశామని చెబుతున్నారు. రేపటి మ్యాచ్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మేం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఎంతో అగ్రెసివ్‌గా ఆడుతున్నాం.. నాకు, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో ఎన్నో (ఐపీఎల్ సన్‌రైజర్స్ అనుభవం) మ్యాచుల ఆడాం.. ఇది ఖచ్చితంగా మా టీమ్‌కు చాలా ప్లస్ అవుతుందని స్పష్టం చేశాడు.
ఆ స్థానంలో బ్యాటింగ్ చేయాలని ఉంది:
తన బ్యాటింగ్ పొజిషన్ గురించి తిలక్ వర్మ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. నాకు వ్యక్తిగతంగా నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం.. కానీ ప్రస్తుతం జట్టుకు మిడిల్ ఆర్డర్లో నా అవసరం ఉంది. అందుకే టీమ్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్నాను అని తెలిపాడు.
►ALSO READ | ఉప్పల్‌లో పరుగుల సునామీ పక్కా.. ఆ ఇద్దరిపైనే భారీ అంచనాలు, టీమిండియా 300 కొట్టేనా?
మూడో టీ20లో దురదృష్టకర రనౌట్:
ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో తాను రనౌట్ అయిన తీరుపై తిలక్ వర్మ స్పందిస్తూ.. గత మ్యాచ్‌లో నేను అలా రనౌట్ అవ్వడం నిజంగా దురదృష్టకరం. నేను కొట్టిన షాట్ బౌండరీకి వెళ్లిపోయిందని అనుకున్నాను.. మైదానంలో ఉన్న హోర్డింగ్ ఫ్లాష్ కావడం వల్ల బాల్ ఫోర్ వెళ్ళిందేమో అని పొరబడ్డాను అని విచారం వ్యక్తం చేశాడు. ఈ అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకున్నాను. ఇక నుంచి ఆన్-ఫీల్డ్ అంపైర్ అధికారికంగా ఫోర్ (Four) సిగ్నల్ ఇచ్చే వరకు రన్ తీస్తూనే ఉంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్‌తో పోరుపై పర్ఫెక్ట్ ప్లానింగ్:
ప్రత్యర్థి వెస్టిండీస్ జట్టు ప్రమాదకరమైనదని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. టీ20 క్రికెట్లో విండీస్ చాలా బలమైన జట్టు.. వారి టీమ్‌లో చివరి ప్లేయర్ వరకు హార్డ్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉంది.. కాబట్టి కరేబియన్ జట్టుని తక్కువ అంచనా వేయకుండా పర్ఫెక్ట్ ప్లాన్‌తో మైదానంలోకి దిగుతామని పేర్కొన్నాడు.
