Pushpa The Rule: పుష్ప 2 దెబ్బకి నార్త్లో సరికొత్త రికార్డ్స్.. దరిదాపుల్లో కూడా లేని కల్కి, దేవర

Pushpa The Rule: పుష్ప 2 దెబ్బకి నార్త్లో సరికొత్త రికార్డ్స్.. దరిదాపుల్లో కూడా లేని కల్కి, దేవర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప 2(Pushpa 2) క్రేజ్ రోజురోజుకి నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటోంది. ఇండియన్ టాప్ స్టార్స్ సైతం టచ్ చేయాలనీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అది కూడా రిలీజ్ కు ముందే. ఆ లిస్టులో మన స్టార్స్ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది పుష్ప 2. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నార్త్ లో పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా.. ఇంతా కాదు. నిజానికి తెలుగులో కంటే బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా. 

ఈక్రమంలోనే ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగులో కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  అందుకు తగ్గట్టుగానే నార్త్ బిజినెస్ జరుగుతుందట. ఈ సినిమా కేవలం నార్త్ లోనే రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందట. ఈ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ మూవీ కల్కి సినిమాకు రూ.100 కోట్లు, ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాకు రూ.50 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. 

ఆ రెండు సినిమాలను దాటేసి పుష్ప 2 ఏకంగా రూ.200 కోట్ల బిజినెస్ చేయడం అనేది మాములు విషయం కాదు. అలా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది పుష్ప 2. ఈ ఒక్క ఎగ్జామ్ఫుల్ చాలు బాలీవుడ్ లో ఈ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పడానికి. ఇక  ఓవర్ ఆల్ బిజిజెస్ లో కూడా పుష్ప 2 రికార్డ్స్ క్రియేట్ చేయనుంది. ఓవర్ ఆల్ బిజినెస్ లో సౌత్ నుండి రూ.900 కోట్లతో ఆర్ఆర్ఆర్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ బ్రేక్ చేసిన రూ.1000 కోట్ల బిజినెస్ చేసేలా ఉంది పుష్ప 2. ప్రస్తుతం ఈ న్యూస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడు లేకుండా ఈ రేంజ్ బిజినెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.. జస్ట్ అల్లు అర్జున్  థింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

Also Read: ప్రభాస్ పెళ్లి తరువాతే.. మొదటి ఆహ్వానం ఆయనకే.. హీరో విశాల్ ఫన్నీ కామెంట్స్