
తమిళ స్టార్ హీరో విశాల్(Vishal), మాస్ డైరెక్టర్ హరి(Hari) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam). మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటిస్తున్నారు. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. ఈ సినిమా కోసం విశాల్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
? #Vishal Anna during #Rathnam movie promotions ? " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb
— Prabhas Fan (@ivdsai) April 18, 2024
ఇక రత్నం సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని యాంకర్ అడగగా. దానికి సమాధానంగా విశాల్ మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటాను. అంతేకాదు.. నాపెళ్ళికి ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్‌కే ఇస్తాను అని తెలిపాడు విశాల్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.