బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి ప్రియాకం చోప్రా. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ... తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఎన్ ఎస్ రాజమౌళి దర్శకత్వంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'లో ప్రియాంక చోప్రా నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన వ్యక్తిగతం జీవితంపై వస్తున్న ట్రోల్స్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చిపడేసింది.
ట్రోల్స్ కు గట్టి కౌంటర్..
నిక్ జోనాస్ తో పెళ్లి అయ్యి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా తమ వివాహంపై వచ్చిన ట్రోల్స్ ను లెక్క చేయుబోనని నటి ప్రియాంక చోప్రా స్పష్టంచేసింది. 2018లో వెళ్లి జరిగినప్పటి నుంచి వయసు తేడా. వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు అనే కారణాలతో తమ సంబంధంపై చాలామంది మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో ఆ మాటలు తనకు చాలా బాధ పెట్టాయని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. "ఇప్పటికీ మా పెళ్లి చెడిపోతుందని ఎదురు చూస్తే..? ఆది వాళ్ల ఇష్టం. నేను ఇక దానిపై ఆలోచించను అని స్పష్టం చేశారు.
నిక్ తనకు ప్రతిరోజూ ప్రేరణే..
తాను, నిక్ ఇద్దరం బయట మాటలకన్నా ఒకరినొకరు నమ్ముకున్నామని ప్రియాంక తెలిపారు. నిక్ లో ఉన్న నిజాయితీ, సూటితనం తనకు చాలా ఇష్టమని చెప్పారు. చిన్న పయసులోనే కెరీర్ మొదలుపెట్టిన నిక్ స్వభావం తనకు ప్రతిరోజూ ప్రేరణనిస్తుందని అన్నారు. ఆరు నెలల్లోనే పెళ్లి నిర్ణయం తీసుకోవడం తనకే ఆశ్చర్యంగా అనిపించించని ప్రియాంక వెల్లడించింది. రాజస్థాన్ లో 2018లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు 2022లో కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్ జన్మించింది. ప్రస్తుతం ప్రియాంక వారణాసి తెలుగు సినిమాతో పాటు సిటాడెల్ సీజన్-2, ది బన్, హెడ్స్ ఆఫ్ స్టేట్ వంటి పలు ప్రాజెక్టుల్లో సటిస్తోంది.
►ALSO READ | Hey Bhagwan Trailer: రహస్య వ్యాపారం.. అంతుచిక్కని మలుపులు.. ఆసక్తి రేపుతున్న 'హే భగవాన్' ట్రైలర్!
