Hey Bhagwan Trailer: రహస్య వ్యాపారం.. అంతుచిక్కని మలుపులు.. ఆసక్తి రేపుతున్న 'హే భగవాన్' ట్రైలర్!

Hey Bhagwan Trailer: రహస్య వ్యాపారం.. అంతుచిక్కని మలుపులు.. ఆసక్తి రేపుతున్న 'హే భగవాన్' ట్రైలర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న  సుహాస్.  వైవిధ్యమైన కథనలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం' హే భగవాన్ '. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ లేటెస్ట్ దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో ఈ మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.

వ్యాపారం పరమ రహస్యం..

ఈ ట్రైలర్‌ను చూస్తే, ఇదొక వినూత్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. సీనియర్ నటుడు నరేష్ ఇందులో సుహాస్ తండ్రిగా నటించారు.. ఆయన దశాబ్దాలుగా ఒక కుటుంబ వ్యాపారాన్ని (Family Business) చాలా రహస్యంగా నడుపుతుంటారు. అది ఎంత రహస్యం అంటే.. సొంత కుటుంబ సభ్యులకు కూడా దాని గురించి తెలియదు. తండ్రి తర్వాత ఆ వ్యాపార బాధ్యతలను సుహాస్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ వ్యాపారం వెనుక ఉన్న అసలు రహస్యం తెలిసినప్పుడు సుహాస్‌కు ఎదురైన పరిణామాలు .  ఆ క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.

క్రేజీ కాంబినేషన్

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సుహాస్ - శివానీ నాగారం మళ్లీ జతకట్టారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది.  దర్శకుడు గోపీ అచ్చర ఈ చిత్రాన్ని కేవలం కామెడీకే పరిమితం చేయకుండా.. క్లైమాక్స్‌లో గుండె బరువెక్కించే బలమైన ఎమోషన్‌ను జోడించారట. తన విలక్షణమైన బాణీలతో గుర్తింపు పొందిన వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్ కానుంది.

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. మంచి కథలను ఎంకరేజ్ చేసే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉండటంతో ‘హే భగవాన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సుహాస్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు.