Allu Arjun: ఆగస్టులోనే 'రాకా' జాతర.. అల్లు అర్జున్-అట్లీ మూవీ గ్లింప్స్ డేట్ ఫిక్స్!

Allu Arjun: ఆగస్టులోనే 'రాకా' జాతర.. అల్లు అర్జున్-అట్లీ మూవీ గ్లింప్స్ డేట్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,  మాస్  డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'రాకా'. ' పుష్ప ' సినిమాతో నేషనల్ వైడ్‌గా రూల్ చేసిన బన్నీ.. ఈసారి అట్లీతో కలిసి ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ నెవర్ బిఫోర్ విజువల్ వండర్ గురించి నెట్టింట కొన్ని మైండ్ బ్లోయింగ్ క్రేజీ అప్‌డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి..

త్రిపాత్రాభినయంలో బన్నీ..

ఈ సినిమాలో అల్లు అర్జున్ కెరీర్‌లోనే మొదటిసారి త్రిపాత్రాభినయంచేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ మూడు విభిన్న కాలాలకు సంబంధించిన షేడ్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో బన్నీ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘రాకా’  గ్లింప్స్ లోడింగ్..

ఈ సినిమా విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో చూపించడానికి మేకర్స్ ఒక క్రేజీ ప్లాన్ చేశారు. మరో రెండు నెలల్లో, అంటే ఈ ఆగస్టులోనే 'రాకా' ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారట. సినిమా ప్రపంచాన్ని, దాని స్కేల్‌ను పరిచయం చేస్తూ మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఈ గ్లింప్స్ ఉండనుందని టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేసింది.

►ALSO READ | రామ్ చరణ్ 'పెద్ది' పవర్‌ఫుల్ బీజీఎమ్ రెడీ.. థియేటర్ల దగ్గర అప్పుడే హౌస్‌ఫుల్ బోర్డులు!

పారిస్ నుంచి  రిటర్న్..

ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో చిన్న వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మరో వారంలో ఆయన ఇండియాకు తిరిగి రానున్నారు. రాగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా ముంబైలో ఒక భారీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లోనే ముఖ్య తారాగణంపై కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. 2027 సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

భారీ తారాగణం.. 

ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకార్ ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నారు. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.