రామ్ చరణ్ 'పెద్ది' పవర్‌ఫుల్ బీజీఎమ్ రెడీ.. థియేటర్ల దగ్గర అప్పుడే హౌస్‌ఫుల్ బోర్డులు!

 రామ్ చరణ్ 'పెద్ది' పవర్‌ఫుల్ బీజీఎమ్ రెడీ.. థియేటర్ల దగ్గర అప్పుడే హౌస్‌ఫుల్ బోర్డులు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్- ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర హల్చల్ సృష్టిస్తూ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రేపే అసలైన పూనకాలు.. 

మెగా ఫ్యాన్స్‌కు సోమవారం, మే 1న  థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే రేంజ్‌లో అసలైన పూనకాలు రాబోతున్నాయి. రామ్ చరణ్ పవర్‌ఫుల్ హీరో ఇంట్రడక్షన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) రేపు విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఇంట్రో స్కోర్ రూటెడ్‌గాఉంటూనే.. మోడ్రన్ టచ్‌తో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని డైరెక్టర్ బుచ్చిబాబు సానా హింట్ ఇచ్చారు. ఈ బీజీఎమ్ వినడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అటు  విజయవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్,

మొదలైన ‘పెద్ది’ జాతర.. 

మరోవైపు బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' జాతర అప్పుడే మొదలైంది. జూన్ 3న పడే గ్రాండ్ ప్రీమియర్ షోల కోసం ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ అయ్యాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి యాప్స్‌లో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని మిగతా ప్రాంతాల ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రీమియర్ షోల పర్మిషన్స్, టికెట్ సేల్స్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నిరీక్షణకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది.

►ALSO READ | రూ. 9 కోట్ల బడ్జెట్.. రూ. 950 కోట్ల వసూళ్లు.. పెద్దల సినిమాకు మైనర్లు క్యూ కట్టడంపై డైరెక్టర్ షాకింగ్ పోస్ట్!

భారీ అంచనాలతో..

వృద్ధి సినిమాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, తిన్నూ ఆనంద్ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతటి భారీ కాస్టింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ 2026 మోస్ట్ అవేటెడ్ మూవీపై అంచనాలు హై రేంజ్‌కు చేరుకున్నాయి..