హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.9 కోట్ల చిన్న బడ్జెట్‌తో మొదలై.. ఏకంగా రూ.950 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ (Obsession). ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. అయితే, ఈ క్రేజీ మూవీపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
దర్శకుడు అసహనం..
ఈ చిత్రంలో ఉన్న తీవ్రమైన హింస, అడల్ట్ కంటెంట్ కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దీనికి ‘ఎ’ (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్ల లోపు వారు ఈ సినిమా చూడటానికి వీల్లేదు. కానీ, థియేటర్లలో సీన్ రివర్స్‌లో ఉందంటూ సంజయ్ గుప్తా సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
మైనర్ల క్యూ..
ఇటీవల ఒక మల్టీప్లెక్స్‌లో జరిగిన అనుభవాన్ని సంజయ్ గుప్తా షేర్ చేసుకున్నారు. మే 29న సాయంత్రం నేను థియేటర్‌కు కొత్తగా రిలీజైన ఒక మలయాళ సినిమా చూడటానికి వెళ్లాను. ఆ స్క్రీన్‌లో కేవలం నేను ఒక్కడినే ఉన్నాను. కానీ, పక్క స్క్రీన్‌లో మా అబ్బాయి ‘అబ్సెషన్’ సినిమా చూస్తున్నాడు. ఆ థియేటర్ మొత్తం చిన్న పిల్లలతో నిండిపోయింది. అందులో చాలా మంది మైనర్లే . ఈ సినిమా ఇంతటి సంచలనంగా మారడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని అని ఆయన రాసుకొచ్చారు.
Yesterday evening I went for a just released Malayalam film and I was the only one in the theatre.
— Sanjay Gupta (@_SanjayGupta) May 30, 2026
In the next screen my son was watching OBSESSION and the theatre was packed with kids most of whom were underage.
It’s amazing how this film is sensation all over.
నిబంధనలు ఏమ్యేయి?
సంజయ్ గుప్తా చేసిన ఈ పోస్ట్ నెట్‌లో వైరల్ అవ్వడంతో పెద్ద చర్చ నడుస్తోంది. 'ఎ' రేటింగ్ ఉన్నప్పటికీ థియేటర్ యాజమాన్యాలు కనీసం ఏజ్ ప్రూఫ్ చెక్ చేయకుండా మైనర్లను లోపలికి ఎలా రానిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇండియాలో ఈ సినిమాను రిలీజ్ చేసేముందు సెన్సార్ బోర్డ్ దాదాపు 38 సెకన్ల పాటు సాగే అత్యంత దారుణమైన హింస, శృంగార సీన్లపై కత్తెర వేసింది.
►ALSO READ | రూ. 300 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'.. కెమెరామెన్‌కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన హీరో సూర్య!
అయినప్పటికీ ఈ సినిమాకు థియేటర్లలో జనం ఎగబడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కేవలం ఇండియాలోనే మొదటి రోజు రూ. 1.75 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది. మొత్తానికి రూ. 950 కోట్ల రేంజ్ వసూళ్లతో దూసుకుపోతున్న 'అబ్సెషన్' చుట్టూ ఇప్పుడు ఈ మైనర్ల వివాదం సరికొత్త చర్చకు దారితీసింది..
