బాలీవుడ్ భారీ ప్రాజెక్టుకు నో చెప్పిన ఐకాన్ స్టార్

బాలీవుడ్ భారీ ప్రాజెక్టుకు నో చెప్పిన ఐకాన్ స్టార్

ఇండియా వైడ్ గా ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్న చూపు ఉండేది. అందుకే సౌత్ స్టార్స్ అందరూ బాలీవుడ్ సినిమాలు చేయడానికి చాలా ట్రై చేసేవారు. కానీ రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన బాహుబలి(Bahubali) సినిమా తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. కేవలం బాలీవుడ్ కాదు.. ప్రపంచ సినిమానే మన టాలీవుడ్ వైపు చూస్తోంది. 

అందుకే డైరెక్టర్స్ సైతం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్(Prabhas) బాలీవుడ్ ప్రొడక్షన్స్ లో సినిమాలు చేస్తున్నారు. సాహూ(Sahoo), ఆదిపురుష్(Adipurush) వంటి సినిమాలు అలా వచ్చినవే. అయితే తాజాగా బాలీవుడ్ నుండి మరో భారీ ప్రాజెక్టు కోసం టాలీవుడ్ స్టార్ హీరోను కాంటాక్ట్ అయ్యారట.   

ALSO READ:బీజేపీలో అటెన్షన్..  క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరుగుతుంది..!  

ఆ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). పుష్ప(Pushpa) సినిమాతో ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అల్లు అర్జున్. దీంతో.. బాలీవుడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మైథలాజికల్ మూవీ అశ్వద్దామ(Ashwatthama) సినిమా కోసం అల్లు అర్జున్ అప్ప్రోచ్ అయ్యారట దర్శకుడు ఆదిత్య దర్(Aditya Dhar). కానీ ఈ ఆఫర్స్ ను రిజెక్ట్ చేశారట హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.