మెగాస్టార్ ఫ్యాన్గా పుష్ప రాజ్.. వైరల్ అవుతున్న షూటింగ్ ఫొటోస్

మెగాస్టార్ ఫ్యాన్గా పుష్ప రాజ్.. వైరల్ అవుతున్న షూటింగ్ ఫొటోస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa2 the rule). సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తోపాటు.. సినీ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క రీజన్ చాలు పుష్ప సీక్వెల్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి. 

Also Read : నాకు నమ్మకం ఉంది.. రెండేళ్ల తరువాత రెండో పెళ్లి: రేణు దేశాయ్

ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో పుష్ప 2 గురించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో అల్లు అర్జున మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా కనిపించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబందించిన ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలో థియేటర్ ముందుకు పెట్టిన చిరంజీవి కటౌట్ పై పుష్పరాజ్ యువసేన తిరుపతి అని రాసి ఉంది. దీంతో ఈ సినిమాలో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా కనిపించనున్నాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. 

అంతేకాదు.. ఈ నేపధ్యంలో వచ్చే సీన్స్ కూడా నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారట సుకుమార్. అభిమాని అంటే ఎదో కటౌట్ కట్టడం, పాలాభిషేకాలు చేయడం వంటివి కాకుండా.. ఆరోజుల్లో చిరంజీవి మ్యానియా ఎలా ఉండేది అనే విషయాన్ని క్లియర్ గా చూపించబోతున్నాడట సుకుమార్. ఇది చిరంజీవికి ఒక ట్రిబ్యూట్ లా ఉండనుందని సమాచారం. మరి సినిమా రిలీజయ్యాక ఈ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.