నాకు నమ్మకం ఉంది.. రెండేళ్ల తరువాత రెండో పెళ్లి: రేణు దేశాయ్

నాకు నమ్మకం ఉంది.. రెండేళ్ల తరువాత రెండో పెళ్లి: రేణు దేశాయ్

నటి రేణు దేశాయ్(Renu desai) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ.. మరో రెండేళ్ల తరువాత రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తతం రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara rao) సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కొత్త దర్శకుడు వంశీ(vamsee) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ భామ నుపూర్ సనన్(Nupur sanon) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో రేణు దేశాయ్ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జానీ సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు రేణు దేశాయ్. చాలా కాలం తరువాత టైగర్ నాగేశ్వర రావులో నటించడానికి ఒప్పుకున్నారు ఆమె. 

Also Read : ఇటలీ బయల్దేరిన చరణ్, ఉపాసన.. వరుణ్, లావణ్య పెళ్లి కోసమేనా?

ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్నారు రేణు. ఈ సందర్బంగా ఆమె తన రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.. నా వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నాను కానీ..  నన్ను తప్పు పట్టకూడదని ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అందరి అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ.. అప్పటికి నా కూతురు వయసు ఏడేళ్లు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తనేం కావాలి? అందుకే.. ఇప్పుడే పెళ్లి వద్దని రద్దు చేసుకున్నాను. ఇప్పుడు నా కూతురు వయసు 13 ఏళ్లు. ఇప్పుడు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ.. మరో రెండేళ్లు ఆగాలనుకుంటున్నాను. ఆద్య కాలేజీకి వెళ్లాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటావంటే మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా, ఆద్య ఇద్దరు చెప్పారు. రెండేళ్ల తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.