ఇటలీ బయల్దేరిన చరణ్, ఉపాసన.. వరుణ్, లావణ్య పెళ్లి కోసమేనా?

ఇటలీ బయల్దేరిన చరణ్, ఉపాసన.. వరుణ్, లావణ్య పెళ్లి కోసమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) ఇటలీ బయలుదేరారు. వీరితోపాటు మెగా వారసురాలు క్లీంకార(Klin kaara) కూడా ఉన్నారు. ఈ ముగ్గురు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో కూడా క్లీంకార మొహం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు ఉపాసన. 

అయితే రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార ఇప్పుడు ఇటలీ వెళ్ళడానికి కారణం మెగా ఫ్యామిలీలో జరగబోయే శుభకార్యమే అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు.. వీరి పెళ్లి ఇటలీలో జరుగనుందని తెలుస్తోంది. ఈ కారణంగానే రామ్ చరణ్, ఉపాసన ఇటలీ వెళ్లనున్నారని సమాచారం. 

అయితే వరుణ్, లావణ్యల పెళ్లి తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహ వేడుక జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన ఇటలీ వెళ్తుండటంతో.. త్వరలోనే ఈ పెళ్లి వేడుక జరుగనుందని తెలుస్తోంది.

ALSO READ: ఫుల్ మీల్స్‌ ఎంటర్‌టైనర్‌లా కీడా కోలా ట్రైలర్.. తరుణ్ భాస్కర్ ఖాతాలో మరో ఫన్ రైడ్ మూవీ