అమెజాన్ ఉద్యోగి కిడ్నాప్…

అమెజాన్ ఉద్యోగి కిడ్నాప్…

ఓ ఆమెజాన్ ఉద్యోగి కిడ్నాప్ అయినట్టు నార్సింగ్ పోలీస్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రతీక్ పాండా అనే అతను హైదరాబాద్ లోని అమెజాన్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈనెల 29న ప్రతీక్ కిడ్నప్ అయినట్లు తెలిపారు. ఇతను కోకాపేట లోని సెవెన్ హిల్స్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడని చెప్పారు.   ప్రతీక్ స్వస్థలం.. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు చెందిన వాడిగా తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ప్రతీక్… అమెరికాలో ఎమ్ఎస్ చేసేందుకు తన తల్లి దండ్రుల దగ్గర కోటీ 40 లక్షలు తీసుకున్నట్లు చెప్పారు పోలీసులు. ప్రతీక్ తండ్రి భగీరత పాండా షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ నెహు యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.