ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్ వివాదం.. అమితాబ్కు భారీ జరిమానా!?

ఫ్లిప్‌కార్ట్‌  బిగ్‌ బిలియన్‌ సేల్ వివాదం.. అమితాబ్కు భారీ జరిమానా!?

పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్స్ అన్నీ భారీ ఆఫర్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ప్రముఖ ఆన్లైన్ రెటైల్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart ) బిగ్‌ బిలియన్‌ సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8 నుండి 15 వరకు ఈ  బిగ్‌ బిలియన్‌ సేల్ (Big Billion sale) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ పెట్టనుంది. 

ఇక ఈ భారీ సేల్ కు సంబంధించి ప్రకటనను బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తో చేయించింది ఫ్లిప్‌కార్ట్‌. అయితే..  ఈ ప్రకటనపై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. దీంతో అమితాబ్ కూడా చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ చేసిన ప్రకటనపై ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటన కస్టమర్స్ ను తప్పుదోవ పట్టించేలా, చిన్న వర్తకులకు నష్టం కలిగించేలా ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌పై చర్యలు తీసుకోవాలని సీసీపీఏ కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఈ యాడ్‌లో కనిపించిన అమితాబ్‌ బచ్చన్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. బిగ్‌ బిలియన్‌ సేల్‌ ప్రకటనను వెంటనే తొలగించడమే కాకుండా.. ఫ్లిప్‌కార్ట్‌ అండ్ అమితాబ్‌కు రూ.10లక్షలు చొప్పున జరిమానా విధించాలని కోరింది.