ఫిఫా వరల్డ్ కప్ యాడ్‌కు ఫిదా అయిన అమితాబ్.. ఖోప్డీ మే చఢ్ గయా హై!

ఫిఫా వరల్డ్ కప్ యాడ్‌కు ఫిదా అయిన అమితాబ్.. ఖోప్డీ మే చఢ్ గయా హై!

Amitabh Bachchan Praises FIFA World Cup Advertisement: ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup 2026) జూన్ 11, గురువారం నాడు గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. టొరంటో (కెనడా)లో జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్ పై రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు ఇండియాలో టెలికాస్ట్ అవుతున్న ఈ వరల్డ్ కప్ అఫీషియల్ యాడ్ (Advertisement) బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనసు దోచుకుంది. ఈ యాడ్ డైలాగ్ విన్న బిగ్ బి.. నవ్వు ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.

నా బుర్రలోకి ఎక్కేసింది బాస్: అమితాబ్ 
ఇండియాలో ఫిఫా వరల్డ్ కప్ ప్రమోషన్ కోసం రన్ అవుతున్న యాడ్‌లో వచ్చే ఒక క్యాచీ డైలాగ్ అమితాబ్‌కు విపరీతంగా నచ్చేసింది. ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. 🤣 🤣😳 ఆహా హా హా హా.. ఫిఫా వరల్డ్ కప్ యాడ్ నడుస్తోంది.. వాహ్! ఏం లాంగ్వేజ్ కనిపెట్టారు భయ్యా: పూరా ఇండియా వాచేగా (POORA INDIA, WATCHEGA !!!) 🤣 🤣😳 హా హా హా!!! అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. అంతేకాదు, ఆయన తన పర్సనల్ బ్లాగ్‌లో కూడా దీని గురించి రాస్తూ.. టీవీలో వస్తున్న ఆ వరల్డ్ కప్ యాడ్ ప్రచారం నా బుర్రలోకి గట్టిగా ఎక్కేసింది. ‘పూరా ఇండియా వాచేగా’ అంటూ పదే పదే నా మైండ్‌లో తిరుగుతోంది" అని హిందీ, ఇంగ్లీష్‌ మిక్సింగ్ డైలాగ్‌ను మెచ్చుకున్నారు..

►ALSO READ | ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు సామాన్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. అమెరికా ఇజ్జత్ మొత్తం పాయే!

కల్కి 2లో సాయి పల్లవి.. బిగ్ బి లైనప్:  
* కల్కి 2 (Kalki 2):
గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది. అయితే ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. ఈ సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె తప్పుకుందని, ఆమె ప్లేస్‌లో లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవిని మేకర్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇందులో అమితాబ్ ‘అశ్వత్థామ’గా మళ్లీ మెప్పించనున్నారు.

* సెక్షన్ 84 (Section 84): ఈ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. కానీ, ఇంకా థియేటర్లలోకి రాలేదు.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. 

* సర్కార్ 4 (Sarkar 4): వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.