ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు సామాన్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. అమెరికా ఇజ్జత్ మొత్తం పాయే!

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు సామాన్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. అమెరికా ఇజ్జత్ మొత్తం పాయే!

England Football Team Equipment Stolen: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రీడా పండగ ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup 2026) అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యంలో ధూంధాంగా స్టార్ట్ అయింది. కానీ, టోర్నీ మొదలైనప్పటి నుంచి అమెరికాలో వివాదాలు, లొల్లిలు అస్సలు తగ్గుతలేవు.. ఇప్పటికే ఎయిర్‌పోర్టులలో ప్లేయర్లు, రెఫరీలను గంటల తరబడి విచారణ చేయడం, ఇరాన్ మ్యాచ్ టికెట్లని రద్దు చేయడంతో పాటు తాజాగా అమెరికా సెక్యూరిటీ పరువు తీసేలా ఒక సంచలన దొంగతనం వెలుగులోకి వచ్చింది.

ఇంగ్లాండ్ జట్టు  ప్రాక్టీస్ సామాన్లు మాయం: 
టోర్నమెంట్‌లో తమ మొదటి మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టుకు అమెరికాలో బిగ్ షాక్ తగిలింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు తన మొదటి మ్యాచ్‌ను జూన్ 18 (గురువారం)న టెక్సాస్ వేదికగా క్రొయేషియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం గత కొన్ని రోజులుగా ఇంగ్లాండ్ ఫ్లోరిడాలో తీవ్రం శ్రమిస్తుంది. షెడ్యూల్ ప్రకారం శనివారం రోజు ఇంగ్లాండ్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ కాన్సాస్ సిటీకి చేరుకోవాల్సి ఉండగా, వారు రాకముందే.. వేరే వాహనాలలో పంపించిన వారి ప్రాక్టీస్ సామాన్లు దారిలోనే మాయం అయ్యాయి. 

కాన్సాస్ సిటీ హైవేపై చోరీ: 
ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించిన సామాన్లను ఫ్లోరిడా నుంచి కాన్సాస్ సిటీకి వెళ్లే రోడ్డు మార్గంలో ఈ చోరీ జరిగింది. సామాన్లు కాన్సాస్ సిటీకి చేరుకున్నాక పరిశీలించగా.. అందులో ఉండాల్సిన కీలకమైన వస్తువులు మాయం అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించబడిన సామాన్లలో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన బూట్లు, ఫుట్‌బాల్స్, నెట్స్, కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన అత్యంత విలువైన కిట్లు ఉన్నట్లు వెల్లడించారు. 

►ALSO READ | భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహిళల మ్యాచ్‌లో పెద్ద కొట్లాట.. నెట్టింట వీడియో వైరల్!

రంగంలోకి దిగిన పోలీసులు: 
ఈ హై-ప్రొఫైల్ దొంగతనంపై అమెరికన్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి విచారాణ కొనసాగించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితులని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  అంతేకాదు, దొంగతనానికి గురైన ఇంగ్లాండ్ జట్టు వస్తువులలో మెజారిటీ సామాన్లను పోలీసులు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే యాంగిల్ లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  

అమెరికా ఇజ్జత్ మొత్తం పాయే: 
ఈ ఇంటర్నేషనల్ స్థాయి టోర్నమెంట్‌లో ఒక స్టార్ జట్టు వస్తువులే చోరీకి గురికావడం అమెరికా దేశ ప్రతిష్ట గంగలో కలిసినంత పనైంది. ఒకవైపు ఫిఫా ప్రపంచకప్ స్టేజీపై హాట్ బ్యూటీ నోరా ఫతేహి తన డ్యాన్స్‌తో వరల్డ్ వైడ్ కంట్రీస్ లైమ్‌లైట్‌ను ఆకర్షించినా.. మరోవైపు ఈ దొంగతనం ఘటన యూఎస్ భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలను బయటపెట్టింది. మెస్సీ, రొనాల్డో వంటి స్టార్ ప్లేయర్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లు ఆడటానికి రెడీ అవుతున్న సమయంలో.. ఇలాంటి చోరీ కేసులు జరగకుండా చూడాలని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.