Harmanpreet Kaur Grabbed Fatima Sana's Neck: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు పాకిస్తాన్‌ను కుమ్ముడు కుమ్మిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గెలిచిన జోష్‌లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో కనిపించింది. గ్రౌండ్‌లోనే హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ ఫాతిమా సన ఇద్దరూ గట్టిగా కొట్లాడుకున్నారని, ఆ కోపంలో హర్మన్‌ప్రీత్ పాక్ కెప్టెన్ గొంతు పట్టుకుందంటూ (Grabbed by the neck) ఒక వీడియో ఎక్స్ (X)లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
అంతా ఏఐ మాయాజాలం:
నిజానికి మ్యాచ్ జరుగుతున్నప్పుడు గానీ, ముగిసిన తర్వాత గానీ హర్మన్‌ప్రీత్ కౌర్, ఫాతిమా సనాల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం షేర్ చేస్తున్న వీడియో క్లిప్ అంతా ఏఐ -జనరేటెడ్ (AI-Generated) వీడియోగా తేలింది. టెక్నాలజీని వాడుకుని ఎవరో కావాలనే ఇద్దరు కెప్టెన్లు కొట్టుకుంటున్నట్టుగా క్రియేట్ చేశారు తప్ప అందులో కొంచెం కూడా నిజం లేదు.
ఇది పక్కా ఫేక్ వీడియో:
ఒకవేళ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు కూడా కొట్టుకుంటే ఐసీసీ (ICC) ఊరుకుంటుందా? మ్యాచ్ రెఫరీలు ఊరుకుంటారా? కానీ అటు ఐసీసీ గానీ, ఇటు బీసీసీఐ (BCCI) లేదా పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఎక్కడా దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక లైవ్ మ్యాచ్‌ను చూపించే అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్స్ కెమెరా క్వాలిటీ చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ ఈ వైరల్ వీడియోలో విజువల్స్ అన్నీ ఏదో కార్టూన్ లాగా, వింతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో చేసినట్టుగా తెలిసిపోతోంది. టాస్ పడినప్పటి నుంచే మ్యాచ్ అయిపోయేదాకా ఇద్దరు కెప్టెన్లు చాలా కూల్ గా ఉన్నారు.
►ALSO READ | ఐపీఎల్‌లో ఊచకోత.. శ్రీలంకలో చేతులెత్తేసిన వైభవ్.. ఫ్లాట్ పిచ్ కాదురా బాటు అంటూ ట్రోలింగ్
నకిలీ వీడియోలతో జర భద్రం:
ఈ మధ్య కాలంలో క్రీడలు, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల్లో ఇట్లనే పిచ్చి పిచ్చి ఏఐ (AI)తో సృష్టించిన నకిలీ వీడియోలు, డీప్‌ఫేక్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి పోస్టులను చూడగానే నమ్మేయకుండా.. అవి నిజమైన స్పోర్ట్స్ ఛానెల్స్‌లో వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
India vs Pak : पहले कहते थे आखिर बाप बाप ही होता है। आज कह रहे हैं। मां भी मां ही होतीं है। टी20 women cricket World Cup में भारत महिला टीम ने गजब पाकिस्तानी महिला टीम को हराया। ऐसी लड़ाई में भी पटक दिया। कमाल...#INDvsPAK #PAKISTAN #क्रिकेट #womenT20 pic.twitter.com/eMMaqsI7CO
— Sunil Maurya (@smaurya_journo) June 14, 2026
