Vaibhav Sooryavanshi: ఐపీఎల్ (IPL 2026) లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వండర్ కిడ్ 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకుని, క్రిస్ గేల్ పేరిట ఉన్న మోస్ట్ సిక్సర్స్ (72 సిక్సులు) రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న వన్డే ట్రై-సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. టీమిండియా ‘A’ తరఫున ఆడుతున్న ఈ యంగ్ ఓపెనర్.. వరుసగా 3 ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై గట్టిగానే ట్రోలింగ్ నడుస్తుంది.
వన్డేల్లో తడబడిన వైభవ్:
తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత్ ‘A’ జట్టు ఈరోజు (సోమవారం) రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. చమిక గుణశేఖర వేసిన తొలి ఓవర్లోనే ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది ఐపీఎల్ రేంజ్ అటాకింగ్ స్టార్ట్ చేశాడు. కానీ, శ్రీలంక ‘A’ కెప్టెన్, ఆఫ్-స్పిన్నర్ సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లోకి రాగానే వైభవ్ తడబడ్డాడు. కేవలం 14 బంతుల్లో 21 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔట్ అయ్యాడు.
మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫ్లాప్ షో:
ఐపీఎల్‌లో 237.3 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ, ఈ వన్డే సిరీస్‌లో క్రీజులో అస్సలు నిలబడలేకపోతున్నాడు. శ్రీలంక ‘A’తో జరిగిన మొదటి మ్యాచ్లో 12 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేయగా.. ఇక ఆఫ్ఘనిస్తాన్ ‘A’తో జరిగిన పోరులో 22 బంతుల్లో 44 రన్స్ తో మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ, దాన్ని భారీ స్కోరుగా మార్చుకోలేకపోయాడు. అలాగే మూడో మ్యాచ్ (vs శ్రీలంక ‘A’): 14 బంతుల్లో 21 రన్స్ మాత్రమే చేసి తన ఫ్లాప్ షోని కంటిన్యూ చేశాడు.
సోషల్ మీడియాలో ట్రోల్స్:
వైభవ్ వరుసగా విఫలం అవుతుండటంతో.. ఈ నెల చివర్లో జరగబోయే ఐర్లాండ్ సిరీస్‌కు, అలాగే జూలైలో ఇంగ్లాండ్ సిరీస్‌కు టీమిండియా మెయిన్ టీమ్‌కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డ్ సృష్టించిన వైభవ్‌ను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. బాబోయ్.. ఇది ఐపీఎల్ ఫ్లాట్ పిచ్ (Flat Pitch) కాదురా బాబు.. ఇంటర్నేషనల్ కండిషన్స్‌లో స్పిన్నర్లను ఎలా ఆడాలో నేర్చుకో, పవర్‌ప్లే ముగియకముందే ఔట్ అవ్వడానికి ఇది టీ20 కాదు, వన్డే మ్యాచ్.. కొంచెం నిలకడగా ఆడాలి అంటూ ఎక్స్ (X) లో ట్రోల్ చేస్తున్నారు.
కోచ్ ఫుల్ సపోర్ట్:
నెట్టింట ట్రోలింగ్ ఎలా ఉన్నా.. ఇండియా ‘A’ హెడ్ కోచ్ హృషికేష్ కణిత్కర్ మాత్రం వైభవ్‌కు అండగా నిలిచాడు. వైభవ్ చాలా చిన్న వయస్కుడైనప్పటికీ, తన బ్యాటింగ్, జట్టులో తన రోల్ ఏంటనేది అతనికి బాగా తెలుసు.. ఎవరైనా సలహాలు ఇస్తే వింటాడు, దానిని ప్రాక్టీస్ చేస్తాడు.. అతని బ్యాటింగ్ తీరు నాకు బాగా నచ్చిందంటూ కోచ్ పాజిటివ్‌గా స్పందించాడు.
Vaibhav Sooryavnashi, making six-hitting look like a casual routine. 😎
— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026
Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/tVvrNAcZUn
