Tantra Trailer: పొలిమేరని మించేలా..క్షుద్రపూజలతో భయపెడుతున్న తంత్ర..

Tantra Trailer: పొలిమేరని మించేలా..క్షుద్రపూజలతో భయపెడుతున్న తంత్ర..

మల్లేశం, వకీల్‌సాబ్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల(Ananya) లీడ్ రోల్‌‌లో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తంత్ర’(Tantra). శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్​ రఘుముద్రి కీలక పాత్ర పోషిస్తుండగా, సలోని రీ ఎంట్రీ ఇస్తోంది. పి.నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్గా తంత్ర మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హార‌ర్‌ ఎలిమెంట్స్‌తో రాబోతున్న తంత్ర మూవీ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్ క‌లిగిస్తుంది. అసలు తాంత్రిక పూజలు ఉండటం నిజమేనా అని ప్రశ్నించగా..‘రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నికుంబళ దేవి ఒక క్షుద్రదేవత. ఇంద్రజిత్తు తలపెట్టింది క్షుద్రపూజ’ అంటూ లక్ష్మణ్ మీసాల తాంత్రిక పూజల గురించే చెప్పే మాటలు ట్రైలర్ ఆసక్తిగా ఉంది.

తంత్ర ట్రైలర్ మొదలవుతూనే..కేవలం అనన్యకు మాత్రమే జుట్టు విరబూసుకుని బాత్ రూమ్ లో ఓ పాప కనిపించడం..తాంత్రిక విధానాల సీక్వెన్స్ లు..తాంత్రిక శక్తులపై ఉన్న డైలాగ్స్తో ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది

ఈ సినిమా కథ విషయానికి వస్తే..తాంత్రిక శాస్త్రంలో ఊహ‌కు అంద‌ని ఎన్నో ర‌హ‌స్యాలున్నాయ‌నే పాయింట్‌తో డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి తంత్ర సినిమాను తెర‌కెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది. ప‌ల్లెటూళ్ల‌లో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయ‌న్న‌ది ఈ సినిమాలో ఆసక్తిగా చూపించ‌బోతున్నారు. ఈ మూవీ మార్చి 15న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ “ఏ” (A) స‌ర్టిఫికెట్ జారీ చేసింది.అనగా ఈ సినిమాని పిల్లబచ్చాలు చూడటానికి వీలు లేదన్న మాట. 

ALSO READ :- రంగారెడ్డి జిల్లా స‌బ్ రిజిస్టార్ ఆఫీస్ లో చోరీ..

Note:'A' సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.