రంగారెడ్డి జిల్లా స‌బ్ రిజిస్టార్ ఆఫీస్ లో చోరీ..

రంగారెడ్డి జిల్లా స‌బ్ రిజిస్టార్ ఆఫీస్ లో చోరీ..

కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఫిబ్రవరి 29వ తేదీ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు దొంగలు.. రికార్డ్ రూమ్ కి చెందిన నాలుగు గ్రిల్స్ తో పాటు రెండు తలుపులు తొలగించి కార్యాలయంలోకి చొరబడ్డారు.  

ALSO READ :- ఉదయకిరణ్ ఆత్మహత్యకు కారణం పవన్ కళ్యాణ్ - నందిగం సురేష్..!

తర్వాత ఉదయం 8  గంటలకు ఆఫీస్ కు వచ్చిన అధికారులు.. చోరీ జరిగినట్లు గుర్తించి.. కూకట్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు,  క్లూస్ టీమ్స్ సిబ్బంది.. వివరాలు సేకరించింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ చోరీపై జాయింట్ సబ్ రిజిస్టర్ సతీష్ మాట్లాడుతూ.. చోరీ ఘటనపై పోలీసులకు విచారణ చేస్తున్నారని..దొంగలు ఏమి ఎత్తుకెళ్లారనేది తెలుస్తుందని చెప్పారు.