ఉదయకిరణ్ ఆత్మహత్యకు కారణం పవన్ కళ్యాణ్ - నందిగం సురేష్..!

ఉదయకిరణ్ ఆత్మహత్యకు కారణం పవన్ కళ్యాణ్ - నందిగం సురేష్..!

బుధవారం తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ, జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో రచ్చ జరుగుతోంది. పవన్ ప్రసంగం ఆద్యంతం సీఎం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ నందిగం సురేష్ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం పవన్ కళ్యాణ్ అని అన్నారు.

అతన్ని టార్గెట్ చేసి ఎలాంటి అవకాశాలు రాకుండా చేశారని, అందువల్లే అతను డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు చెమటోడ్చి పార్టీ కోసం కష్టపడుతుంటే పవన్ కళ్యాణ్ వారి చెమటను ప్యాకేజి కోసం చంద్రబాబుకు అమ్ముకుంటున్నాడని మండి పడ్డాడు. తన స్వార్థం కోసం సొంత కుటుంబం మీద దిగజారి వ్యాఖ్యలు చేస్తాడని అన్నారు.

ALSO READ :- సీఎం రేవంత్కు ప్రతిసవాల్ విసిరిన కేటీఆర్

పవన్ తన స్వార్థం కోసం తండ్రి వెంకట్రావు క్యారెక్టర్ ని కూడా కించపరిచాడని అన్నాడు. గతంలో ప్రజారాజ్యం సమయంలో చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి అన్న చిరంజీవి మీద, అన్న కూతురు శ్రీజ మీద, తన తల్లి మీద ఎలాంటి దుష్ప్రచారం చేశారో మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు చంద్రబాబుకు ఎలా ఊడిగం చేస్తున్నామంటూ ప్రశ్నించారు.