10 జట్లు, 24 మ్యాచ్‌లు.. ఆసియా కప్ 2027 అర్హత పోరు.. ఏసీసీ ప్రీమియర్ కప్ షెడ్యూల్ ఇదే!  

10 జట్లు, 24 మ్యాచ్‌లు.. ఆసియా కప్ 2027 అర్హత పోరు.. ఏసీసీ ప్రీమియర్ కప్ షెడ్యూల్ ఇదే!  

ACC Men’s Premier Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ 2027 టోర్నీకి అర్హత సాధించేందుకు అసలైన పోరాటం ప్రారంభం కాబోతోంది. దీనికి మార్గం సుగమం చేసే ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2026 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు మలేషియా వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచే ఒకే ఒక్క జట్టుకు ఆసియా కప్ 2027 ప్రధాన రేసులో ఆడే అర్హత లభిస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. 

నాకౌట్ పోరు షెడ్యూల్: 

మలేషియాలోని బయూమాస్ ఓవల్, వైఎస్‌డీ యూకేఎమ్ ఓవల్ మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 30వ తేదీన ఒమన్ vs సింగపూర్, హాంగ్‌కాంగ్ vs సౌదీ అరేబియా మ్యాచ్‌లతో ఈ టోర్నీ షురూ కానుంది. లీగ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి. గ్రూప్ దశ ముగిసాక సెప్టెంబర్ 10వ తేదీన రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు, ఆ తర్వాత సెప్టెంబర్ 12న మూడో స్థానం పోటీతో పాటు బయూమాస్ ఓవల్‌లో గ్రాండ్ ఫైనల్ జరగనుంది. 

ఆసియా కప్ 2027 అర్హత వివరాలు: 

ఆసియా కప్ 2027 టోర్నీ జూన్ 18 నుంచి జూలై 4వ తేదీ వరకు బంగ్లాదేశ్ వేదికగా జరిగే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించాయి. ఇప్పుడు ఏసీసీ ప్రీమియర్ కప్ గెలిచే జట్టు ఆరో టీమ్‌గా వీరితో చేరనుంది. రాబోయే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆసియా కప్‌ను 50 ఓవర్ల (ODI) ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.  

ఒకే ఒక్క స్థానం కోసం పోటీ పడే 10 జట్లు: 

* గ్రూప్ ఎ: నేపాల్, హాంగ్‌కాంగ్, మలేషియా, బహ్రెయిన్, సౌదీ అరేబియా
* గ్రూప్ బీ: యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్, సింగపూర్

మ్యాచ్‌లు జరిగే షెడ్యూల్ ఇదే: 

* ఆగస్ట్ 30: ఒమన్ vs సింగపూర్, బేయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* ఆగస్ట్ 30: హాంకాంగ్ చైనా vs సౌదీ అరేబియా – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* ఆగస్ట్ 31: ఖతార్ vs UAE – బయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* ఆగస్ట్ 31: బహ్రెయిన్ vs నేపాల్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 1: సౌదీ అరేబియా vs మలేషియా – బేయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 1: సింగపూర్ vs కువైట్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 2: బహ్రెయిన్ vs హాంకాంగ్ చైనా – బేయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 2: ఖతార్ vs ఒమన్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 3: కువైట్ vs UAE – బయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 3: మలేషియా vs నేపాల్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 4: సింగపూర్ vs ఖతార్ - బేయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 4: సౌదీ అరేబియా vs బహ్రెయిన్ - YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 5: ఒమన్ vs కువైట్ - బేయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 5: హాంకాంగ్ చైనా vs మలేషియా – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబర్ 6: నేపాల్ vs సౌదీ అరేబియా - బయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 6: UAE vs సింగపూర్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 7: మలేషియా vs బహ్రెయిన్ - బయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 7: కువైట్ vs ఖతార్ – YSD UKM ఓవల్, బాంగి, మలేషియా

* సెప్టెంబరు 8: నేపాల్ vs హాంకాంగ్ చైనా – బయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 8: UAE vs ఒమన్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబరు 10: A1 vs B2, 1వ సెమీ-ఫైనల్ – బేయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా

* సెప్టెంబర్ 10: B1 vs A2, 2వ సెమీ-ఫైనల్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా

* సెప్టెంబర్ 12: 3వ ప్లేస్ ప్లేఆఫ్ – YSD UKM ఓవల్, బంగి, మలేషియా.

* సెప్టెంబర్ 12: ఫైనల్ - బయుమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియా