రెండున్నరేళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది... వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చారు: భూమన కరుణాకర్ రెడ్డి

రెండున్నరేళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది... వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చారు: భూమన కరుణాకర్ రెడ్డి

రెండున్నరేళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టిందని.. వైదిక కార్యక్రమాలకు టీటీడీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. బుధవారం ( ఆగస్టు 12 ) మీడియాతో మాట్లాడిన ఆయన ఈమేరకు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎల్నీనొ ప్రభావంతో రుతుపవనాలు మార్పులు సంభంవించాయని.. టిటిడి వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చిందని అన్నారు. శ్రీవారి ఆలయ ప్రతినిధులే సాంప్రదాయాలు మంటగలుపుతున్నారని అన్నారు.

టిటిడి ఆధ్వర్యంలో శాతాబ్దాలుగా యాగాలు నిర్వహించేవారని.. దేశం, రాష్ట్రం, ప్రజలు బాగుండాలని యాగాలు చేసేవారని అన్నారు. ఇప్పుడు ప్రభువులు, పైన ఉన్నవారి ఆశీస్సులతో వారు చేయాల్సిన వేదిక సంస్కృతి కాపాడటంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని.. కొండపైన ఉన్న జలాశయాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భూమన.

వేద సంస్కృతిని బ్రష్టుపట్టిస్తున్నారని.. దార్మిక కార్యక్రమాలు వదిలి దనదాహ కార్యక్రమాలలో మునిగిపోయారని అన్నారు భూమన. వేద పరిరక్షణకు నిధులు ఉన్న కార్యక్రమాలు చెయ్యాలేదని.. తాము అధికారంలో ఉన్నప్పుడు అనేక వైధిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని అన్నారు.

ఇవాళ కరువు కాటకాలతో మునిగిపోతుంటే వరణయాగం చెయ్యాలనే ఆలోచనే టిటిడికి లేదని మండిపడ్డారు భూమన. ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదని.. టీటీడీ వరణయాగం చేస్తే వర్షాలు కురుస్తాయని నమ్మక ఉందని అన్నారు. చిన్న దేవాలయాల పాలకమండలులే చేస్తుంటే, ప్రపంచ ప్రఖ్యాత గాంచిన టిటిడి చెయ్యడం లేదంటే ప్రభువుల కాళ్లు మొక్కడానికే అని తెలుస్తుందని అన్నారు.

టీటీడీ అధికారులు కుచేలుడికి కుడా పాఠాలు నేర్పే స్థాయికి పోయారని.. ఇకనైన వెంటనే మేల్కొని వీఐపీ సేవలో కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ది విమర్శ కాదని, బుద్ది తెచ్చుకొని ఈ యాగాల పరిరక్షణ చెయ్యాలని అన్నారు భూమన.