తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది. 52.17 లక్షల మంది ఓటర్ల కోసం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 40 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొడంగల్ లో సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జనగామ జిల్లా :
- జనగామ మున్సిపాలిటీలో డబ్బుల కోసం రోడ్డెక్కిన ఓటర్లు
- ఓటు కు కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు రాలేదని ఓటర్ల ఆందోళన
- 23వ వార్డు సరస్వతి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మహిళల ఓటర్ల ఆందోళన
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొందరికే ఓటు కు డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదని ఆగ్రహం
- బీఆర్ఎస్ అభ్యర్థిని పది సంవత్సరాలు ఓటు వేసి గెలిపించుకున్నామని...ఈ ఎన్నికల్లో డబ్బులు మాత్రం కొందరికే పంపిణీ చేశారని మహిళా ఓటర్ల ఆవేదన
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ ఎన్నికలకు మధ్యాహ్నం 3 వరకు 74.28 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు 71.65 శాతం పోలింగ్ నమోదు
1. మెదక్ మున్సిపాలిటీ- 71.31 శాతం
2. రామాయంపేట మున్సిపాలిటీ- 76.11 శాతం
3. తూప్రాన్ మున్సిపాలిటీ- 71.50 శాతం
4. నర్సాపూర్ మున్సిపాలిటీ- 69.10 శాతం
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు 72.68 శాతం పోలింగ్ నమోదు
1. గజ్వేల్ మున్సిపాలిటీ- 69.64 శాతం
2. హుస్నాబాద్ మున్సిపాలిటీ- 73.91 శాతం
3. చేర్యాల మున్సిపాలిటీ- 76.27 శాతం
4. దుబ్బాక మున్సిపాలిటీ- 75.91శాతం
సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 66.14శాతం పోలింగ్ నమోదు
1. సంగారెడ్డి మున్సిపాలిటీ- 57.65 శాతం
2. సదాశివపేట మున్సిపాలిటీ- 70.76 శాతం
3. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ- 70.19శాతం
4. నారాయణఖేడ్ మున్సిపాలిటీ- 65.32 శాతం
5. జహీరాబాద్ మున్సిపాలిటీ- 64.18 శాతం
6. కోహిర్ మున్సిపాలిటీ- 67.22శాతం
7. ఇస్నాపూర్ మున్సిపాలిటీ- 70.36 శాతం
8. గడ్డపోతారం - 77.49 శాతం
9. గుమ్మడిదల - 69.25 శాతం
10. ఇంద్రేశం - 74.44 శాతం
11. జిన్నారం- 78.98 శాతం పోలింగ్ నమోదు
మంచిర్యాల జిల్లా:
* మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
* పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు
* మధ్యాహ్నం 3 గంటల వరకు 70.02 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్న అధికారులు
సంగారెడ్డి జిల్లా:
- సంగారెడ్డి 34 వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి గళ్ళ పట్టిన సిఐ
- పోలింగ్ బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డి
- పోలింగ్ ఆపెస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెల్లుతున్న జగ్గారెడ్డి
- పోలీసులు జగ్గారెడ్డి కి మధ్య వాగ్వాదం... తోపులాట
- నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటరు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ప్రజలతో కలసి మాట్లాడిన ఎంపీ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 49 శాతం పోలింగ్
సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 57.98 శాతం పోలింగ్ నమోదు
- గజ్వేల్ మున్సిపాలిటీ- 54.80 శాతం
- హుస్నాబాద్ మున్సిపాలిటీ- 58.05 శాతం
- చేర్యాల మున్సిపాలిటీ- 62.86 శాతం
- దుబ్బాక మున్సిపాలిటీ- 61.74 శాతం
- సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.35 శాతం పోలింగ్ నమోదు
- సంగారెడ్డి మున్సిపాలిటీ- 44.47 శాతం
- సదాశివపేట మున్సిపాలిటీ- 56.62 శాతం
- ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ- 54.97 శాతం
- నారాయణఖేడ్ మున్సిపాలిటీ- 51.72 శాతం
- జహీరాబాద్ మున్సిపాలిటీ- 51.32 శాతం
- కోహిర్ మున్సిపాలిటీ- 54.51 శాతం
- ఇస్నాపూర్ మున్సిపాలిటీ- 56.88 శాతం
- గడ్డపోతారం - 61.02 శాతం
- గుమ్మడిదల - 54.84 శాతం
- ఇంద్రేశం - 58.21 శాతం
- జిన్నారం- 62.33 శాతం
- వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ లో 17 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం
- పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల మండిపాటు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం
- జనగామ మున్సిపాలిటీలో 46.65% పోలింగ్ నమోదు
- భూపాలపల్లి మున్సిపాలిటీలో 54.80 % పోలింగ్ నమోదు
- తొర్రూరు మున్సిపాలిటీలో 52.58%పోలింగ్ నమోదు
- స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 56.38%పోలింగ్ నమోదు
- ములుగు మున్సిపాలిటీలో 58.12%పోలింగ్ నమోదు
- వర్ధన్నపేట మున్సిపాలిటీలో 61.68% పోలింగ్ నమోదు
- నర్సంపేట మున్సిపాలిటీలో 57.64% పోలింగ్ నమోదు
- మహబూబాబాద్ మున్సిపాలిటీలో 51.40%పోలింగ్ నమోదు
- డోర్నకల్ మున్సిపాలిటీలో 58.87% పోలింగ్ నమోదు
- పరకాల మున్సిపాలిటీలో 53.51 % పోలింగ్ నమోదు
- కేసముద్రం మున్సిపాలిటీలో 65.14% పోలింగ్ నమోదు
- మరిపెడ మున్సిపాలిటీలో 66.22% పోలింగ్ నమోదు
- కుమ్రంబీమ్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ లో
- ఒంటి గంట వరకు నమోదు 43.87%
- అసిపాబాద్ మున్సిపాలిటీ లో 59.64%నమోదు
- మహాబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మధ్యహ్నం 1.గంటల వరకు 52.58% పోలింగ్ నమోదు.
- చెన్నూరు మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంటల వరకు 57.97 శాతం పోలింగ్
- క్యాతనపల్లి మున్సిపాలిటీ లో 1 గంట వరకు 51.74 శాతం పోలింగ్ నమోదు
- మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మున్సిపాలిటీ లో మధ్యాహ్నం 1 గంట వరకు 50.40% పోలింగ్ నమోదు.
- పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ తో పాటు మూడు మున్సిపాలిటీల ఎన్నికల్లో మధ్యాహ్నం 1.00 గంట వరకు 45.69 % శాతం
- రామగుండం కార్పొరేషన్ 42.12%
- పెద్దపల్లి 50.69%
- మంథని 57.49%
- సుల్తానాబాద్ 60.70%
- రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు మధ్యాహ్నం 1వరకు 52.57% నమోదు
- మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ లో 57.8,
- అలియాబాద్ లో 59.7,
- మూడు చింతలపల్లి లో 63.54
- కోదాడ పట్టణంలోని 14వ వార్డు 34వ బూతులో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు
- కరీంనగర్(MCK) - 39.27 శాతం
- జమ్మికుంట - 47.35
- హుజురాబాద్ - 52.90
- చొప్పదండి - 56.96
- కరీంనగర్ నగరపాలక సంస్థలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.27శాతం
- నిర్మల్ మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.73 శాతం
- ములుగు జిల్లా మున్సిపాలిటీ మధ్యాహ్నం 1 గంట వరకు 58.12 శాతం
- జనగామ మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 46.65శాతం
- స్టేషన్ ఘనపూర్ లో 56.38శాతం నమోదు.
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ మధ్యాహ్నం 1 గంటకు వరకు 66.22 శాతం నమోదు.
నారాయణపేట జిల్లాలో మధ్యాహ్నం 1 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం...
- నారాయణపేట :- 52.39
- కోస్గి :- 55.50
- మక్తల్ :-51.51
- మద్దూరు :- 64.81
- జిల్లా మొత్తం శాతం 54.62
- జమ్మికుంట మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.35 శాతం
- హుజురాబాద్ మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.9 శాతం
- నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 43.53 పోలింగ్
- రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1:00 గంట వరకు 52.43 శాతం పోలింగ్ నమోదు
- నిర్మల్ జిల్లా గాజులపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
- నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్ ఎన్నికల విధులకు అధికారుల గైర్హాజరు
- 17 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ చంద్రశేఖర్.
- నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు..
- మక్తల్ పోలింగ్ బూత్ నెంబర్ 16 లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి.
- రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్ బాబు
- వరంగల్ జిల్లాడిసి తండాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లకు చేదు అనుభవం..
- వర్ధన్నపేట తాండలను మున్సిపాలిటీగా చేసి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ తరిమికొట్టిన ఓటర్లు..
- స్థానికులను శాంతింప చేసిన పోలీసులు.
- కరీంనగర్ కిసాన్ నగర్ చింతల్ పోలింగ్ కేంద్రం బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
- పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు.
- డబ్బులతో వస్తుంటే పట్టుకున్నామని కరెన్సీ నోట్లను చూపించిన పోలీసులు
- ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ 11వ వార్డ్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
- తనిఖీల్లో మహిళా ఓటర్ దగ్గర కత్తి లభ్యం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఆందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో 13 వ బూత్ లో ఓటు హక్కు ను వినియోగించుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
- వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
- పలు మున్సిపాలిటీలలో ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న పోలింగ్
- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల వాగ్వాదాలతో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర టెన్షన్
- మహబూబాబాద్ లో 14 వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలపై BRS కార్యకర్తలు దాడి
- భూపాలపల్లి మున్సిపాలిటీలో 22 వార్డు BRS అభ్యర్థి డబ్బులు పంచుతుండగా గొడవ
- డబ్బులు సీజ్ చేసిన పోలీసులు
- వరంగల్ జిల్లానర్సంపేట మున్సిపాలిటీ 24 వార్డులో బిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న పోలీసులు..
- రూపాయలు 11 వేల నగదు సీజ్..కేసు నమోదు చేసిన పోలీసులు
- ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీలోని 31, 32 వార్డుల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు అధికారులతో వాగ్వాదం
- ఇతర వ్యక్తులు బూతుల వద్దకు వచ్చి , ప్రచారం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగిన బిఆర్ఎస్ శ్రేణులు
నారాయణపేట జిల్లా
- ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
- నారాయణపేట 30.91
- కోస్గి 32.22
- మక్తల్ 32.23
- మద్దూరు 41.86 శాతం పోలింగ్ నమోదు.
- మొత్తం 33.06 శాతం పోలింగ్ నమోదు
జోగులాంబ గద్వాల జిల్లా...
- ఉదయం11 గంటల వరకు 38.35 పోలింగ్ శాతం...
- 1)అలంపూర్:40.84 శాతం
- 2)గద్వాల:33.45 శాతం
- 3)అయిజ:47.52 శాతం
- 4)వడ్డేపల్లి:46.61 శాతం..
జగిత్యాల జిల్లా :
- జగిత్యాల, రాయికల్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- ఉదయం 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 24.03 శాతం నమోదు
- జగిత్యాలలో 23.81 నమోదైన పోలింగ్ శాతం
- రాయికల్ లో నమోదైన 26.93 పోలింగ్ శాతం
- ధర్మపురి 26.28
- కోరుట్ల 22.91
- మెట్ పల్లి 24.51
- మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ లల్గాడి మలక్ పేట 5వ వార్డులో ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతూన్న బిజెపి అభ్యర్థి
- వెండి కాయిన్ల ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోబ పెడుతున్న బీజేపీ నాయకులు.
- జనగామ జిల్లామున్సిపల్ ఎన్నికల్లో సెయింట్ మేరీస్ స్కూల్ లో సతి సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించు కున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్
- వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 13 వార్డుకు చెందిన 27 పోలింగ్ స్టేషన్ వద్ద ఇంకా కొనసాగుతున్న గొడవలు
- పరిగి ఎస్ఐ అత్యుత్సాహం.. వయసు అయిపోయిన ఓటర్లను బయటికి నెట్టివేసిన ఎస్ఐ
- పెద్దపల్లి మున్సిపాలిటీలోని 29వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్ 59, 60 లో కాంగ్రెస్ లోగో ఎమ్మెల్యే విజయరమణరావు ఫోటోలతో కూడిన ఓటర్ స్లిప్స్ పంచుతున్న ఏజెంట్లు , కార్యకర్తలు...
- రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పదవ వార్డులో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం
- ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
- ఎసిపి లక్ష్మీనారాయణ జోక్యంతో సద్దుమణిగిన పరిస్తితి
- మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ లో 37.35, అలియాబాద్ లో 38.82, మూడు చింతలపల్లి లో 38.56 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 11 గంటల వరకు మొత్తం 38.24 శాతం నమోదు .
పెద్దపల్లి జిల్లా ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ 27:07 % శాతం
- రామగుండం కార్పొరేషన్ 24.31%
- పెద్దపల్లి 30.52%
- మంథని 37.38%
- సుల్తానాబాద్ 39.08%
- మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు గొలిపర్తి వద్ద ఉద్రిక్తత...
- బిజెపి నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు
- ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చదరగొట్టిన పోలీసులు..
- నల్గొండ 33 డివిజన్ నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .
- ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్న కోమటిరెడ్డి.
- ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు.
- రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా
- వికారాబాద్ మున్సిపల్లో 11 గంటల వరకు 29.87 శాతం నమోదు అయ్యింది.
- వేములవాడ మున్సిపల్ పరిధిలోని 12 వార్డులో బిఆర్ఎస్అభ్యర్థికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కృష్ణ వేణి ఆరోపణ.
- రోడ్ పై బైఠాయించి నిరసన
- జగిత్యాల మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 27 శాతం వరకు పోలింగ్
- జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.36% పోలింగ్ నమోదైంది.
- మొత్తం 5664 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 2639, మహిళలు 3024, ఇతరులు 1 ఓటు వేశారు.
వరంగల్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం
- మహబూబాబాద్ _ 32.23%
- డోర్నకల్ _ 36.96%
- కేసముద్రం_ 39.84%
- మరిపెడ _ 43.23%
- తొర్రూరు_ 28.92%
- జనగామ _ 28.50%
- స్టేషన్ ఘనపూర్ _ 32.32%
- ములుగు _33.35%
- మంచిర్యాల జిల్లాచెన్నూరు మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్...
- పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు...
- ఉదయం 11గంటల వరకు 37.20 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్న అధికారులు...
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ధర్నా
- కాంగ్రెస్ పార్టీ చెందిన స్థానికేతరులను పంపించి వేయాలని బస్టాండ్ ఎదుట ధర్నా
- మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 35.94 శాతం పోలింగ్
- మెదక్ : 35.64 %
- రామాయంపేట: 38.27 %
- తుప్రాన్: 35.94 %
- నర్సాపూర్. 34.09 %
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో రవీంద్ర నగర్ లోని పోలింగ్ స్టేషన్ ఓటు హక్కు వినియోగించుకున్నా ఎమ్మెల్యే పాయల్ శంకర్..
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత
- పుస్కోస్ స్కూల్ పోలింగ్ సెంటర్ వద్ద పోలీసులు, కాంగ్రెస్ , బిజెపి నేతలకు వాగ్వాదం
- పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ
- నేతులకు సర్ది చెప్పి చెదరగొట్టిన పోలీసులు
కరీంనగర్ జిల్లా ఉదయం 11 గంటల వరకు
కరీంనగర్(MCK) - 24.36 శాతం పోలింగ్
జమ్మికుంట - 24.89
హుజురాబాద్ - 30.41
చొప్పదండి - 34.49
- జనగామ మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 26.50 శాతం పోలింగ్
- స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 33.32 శాతం పోలింగ్
- షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 32.05% శాతం పోలింగ్
- పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటిలో 11 గంటల వరకు 37.38 శాతం పోలింగ్ నమోదు.
- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఎన్నికల సరలిని పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ రవి కిరణ్,
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని హైస్కూల్ లో 16వార్డు లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి.
- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ 9వ వార్డులో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి.
- తొర్రూర్ మున్సిపాలిటీలో స్కూటీ నడుపుతూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందడి
- స్కూటీ మీద వెళ్ళి పోలింగ్ సరలిని పరిశీలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
- ఐదు వార్డులలో స్కూటీ పై తిరుగుతూ పోలింగ్ పరిశీలించిన ఎమ్మెల్యే
కరీంనగర్ జ్యోతి నగర్ లోని ఎస్సార్ హై స్కూల్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్.
- మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు 10 పోలింగ్ కేంద్రాల పోలింగ్ కు ఆటంకం కల్గిస్తోన్న మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పోడేటి శ్రీనివాస్ గౌడును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నిజామాబాద్ నగరంలోని 47 వ వార్డులో ఓటు వేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- ప్రజలంతా ఓటు హాక్కుని వినియోగించుకోవాలన్న మహేశ్.
- అభివృద్ధి చేసే నాయకులని ఎన్నుకోవాలి..బీజేపీ మతం పేరుతో చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తుంది.
- నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంటుందని ఆరోపణ
- జగిత్యాల పురానిపేట లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ ఎల్. రమణ. రాజ్యాంగం కల్పించిన ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపు
- జగిత్యాల పోలింగ్ కేంద్రం వద్ద కంటతడి పెట్టిన బిజెపి రెబల్ అభ్యర్థి పులి శ్రీధర్
- స్వంతంత్ర అభ్యర్థి వీరబాతిన్ని పద్మజ బంధువు శ్రీధర్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగింత....
- దొంగ ఓటర్లకు ఫోన్ చేస్తున్నాడని ఆరోపిస్తూ శ్రీధర్ ఫోను తీసుకున్న స్వతంత్ర అభ్యర్థి పద్మజ బంధువు....
- జగిత్యాల రాయికల్ మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు తారుమారు
- తొమ్మిదో వార్డు పోలింగ్ కేంద్రంలో, ఎనిమిదో వార్డుకు సంబంధించిన 12 బ్యాలెట్ పేపర్లు
- బ్యాలెట్ పేపర్లు సంబంధిత పోలింగ్ కేంద్రానికి పంపించి పోలింగ్ కంటిన్యూ చేసిన సిబ్బంది
- జగిత్యాల పట్టణంలోని 31 వార్డు లో బీాఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాగ్వాదం తోపులాట....
- నినాదాలు చేసే విషయంలో రెండు పార్టీల మధ్య మధ్య వాగ్వాదం
- పోలీసులు రావడంతో సద్దుమనిగిన గొడవ
కొడంగల్ పోలింగ్ స్టేషన్ 6 లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లామధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డయిరీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
- జనగామ మున్సిపాలిటీలో 10.59 % పోలింగ్ నమోదు
- భూపాలపల్లి మున్సిపాలిటీలో 12.0% పోలింగ్ నమోదు
- తొర్రూరు మున్సిపాలిటీలో 8.77%పోలింగ్ నమోదు
- స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 11.53%పోలింగ్ నమోదు
- ములుగు మున్సిపాలిటీలో 10.19%పోలింగ్ నమోదు
- వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02%పోలింగ్ నమోదు
- నర్సంపేట మున్సిపాలిటీలో 12.29%పోలింగ్ నమోదు
- మహబూబాబాద్ మున్సిపాలిటీలో 10.58 %పోలింగ్ నమోదు
- డోర్నకల్ మున్సిపాలిటీలో 13.11% పోలింగ్ నమోదు
- పరకాల మున్సిపాలిటీలో 9.20% పోలింగ్ నమోదు
- కేసముద్రం మున్సిపాలిటీలో 13.36% పోలింగ్ నమోదు
- మరిపెడ మున్సిపాలిటీలో 16.32% పోలింగ్ నమోదు
- మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒటు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దంపతులు
- నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో బూత్ నెంబర్స్ 24,78 లో దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన పోలీసులు
- భూపాలపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బులు కలకలం
- 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి డబ్బు పంచే ప్రయత్నం..
- పోలీసులు పట్టుకునే క్రమంలో డబ్బు వదిలేసి పరార్
- సుమారు లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మంచిర్యాల జిల్లాలో 9 గంటల వరకు 11.18 శాతం పోలింగ్ నమోదు
- బెల్లంపల్లి మున్సిపాలిటీలో 9 గంటల వరకు పోలింగ్ 12:44 శాతం
-
క్యాతనపల్లి మున్సిపాలిటీ లోఉదయం 9 గంటల వరకు 14 శాతం పోలింగ్
- మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ లో 15.26, అలియాబాద్ లో 17.91, మూడు చింతలపల్లి లో 15.78 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం నమోదు
- వికారాబాద్ జిల్లా పరిగిలోని నంబర్ వన్ స్కూల్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకులు పదే పదే పోలింగ్ స్టేషన్ వద్దకు ఎందుకు వెళ్తున్నారంటూ అభ్యంతరం
- నిజామాబాద్ వినాయక్ నగర్లోని 368 వ పోలింగ్ కేంద్రం లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అరవింద్
- నిర్మల్ మున్సిపాలిటిలో ఉదయం 9 గంటల వరకు 11.91 శాతం పోలింగ్ నమోదు
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు జిల్లాలో 18.82 శాతం పోలింగ్ నమోదు
- మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు లొ బీఆర్ఎస్. బిజెపి నాయకుల మధ్య ఘర్షణ
- ఆలంపూర్ మున్సిపాలిటీలో ఉదయం 9 గంటల వరకు 18.98శాతం పోలింగ్ నమోదు
- గద్వాల మున్సిపాలిటీలోఉదయం 9 గంటల వరకు 17.08శాతం పోలింగ్ నమోదు
- ఐయిజ మున్సిపాలిటీలోఉదయం 9 గంటల వరకు 21.17శాతం పోలింగ్ నమోదు
- వడ్డేపల్లి మున్సిపాలిటీలోఉదయం 9 గంటల వరకు 20.23శాతం పోలింగ్ నమోదు
- నాగర్ కర్నూలు జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 12.79శాతం పోలింగ్ నమోదు
- ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 9.18 పోలింగ్ శాతం నమోదు.
- చొప్పదండి మున్సిపాలిటీ లో 9 గంటల వరకు 12.47 శాతం నమోదు.
- జమ్మికుంట లో ( 9 గంటల వరకు)7.74 శాతం నమోదు
- ఉదయం 9 గంటల వరకు హుజురాబాద్ లో 11.07 శాతం నమోదు.
- మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.64 శాతం పోలింగ్ నమోదు
- వేములవాడ మున్సిపాలిటీ లో ఉదయం 9 గంటల వరకు 14 శాంత పోలింగ్ నమోదు
- ఆదిలాబాద్ మున్సిపాలిటీలో తొమ్మిది గంటల వరకు 10.7 నమోదు
- కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి
- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో 9 గంటల వరకు13.65 శాతం పోలింగ్ నమోదు
- మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి.
- ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపు
- ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడి
- మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమన్న వివేక్
- సిద్దిపేటగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉదయం 9 గంటల వరకు 15.16 శాతం పోలింగ్ నమోదు
- ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
- నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన.
- భువనగిరి మున్సిపాలిటీలో మూడో వార్డులో రాయగిరి జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు దంపతులు
- మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులో బీజేపీ,బీఆర్ఎస్ నాయకులకు మద్య గొడవ..
- పరస్పరం దాడులు చేసుకున్న ఇరువార్గాలు, చెదరగొట్టిన పోలీసులు పోలీసులు
- మెదక్ మున్సిపాలిటీలోని 18 వ వార్డులో ఓటుహక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు
- మిర్యాలగూడ పట్టణం 41వ వార్డులోని పోలింగ్ బూత్ 123 లో తన ఓటు హక్కును వినియోగించుకున్న సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్.
- చొప్పదండి పోలింగ్ కేంద్రంలో ఓటర్ లిస్ట్ సరిగ్గా లేదని 4వ వార్డ్ అభ్యర్థి ఆందోళన
- ఓటర్లు లిస్ట్ కు పోలింగ్ కేంద్రంలో లిస్ట్ కు తేడా ఉందని ఆరోపణ
- సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 45 వ వార్డులో ఉద్రిక్త వాతావరణం.
- బిఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం.
- నిర్మల్ జిల్లా బైంసా పట్టణం పాండ్రి గల్లీలో గ్రీన్ పోలింగ్ స్టేషన్..
- ఓటర్లు అకట్టుకుంటున్నా పోలింగ్ స్టేషన్.
- ఓటు వేసిన వందమంది ఓటర్లకు మొక్కులు పంపిణీ చేసిన అదికారులు
- సంతోషం వ్యక్తం చేస్తున్నఓటర్లు
- మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య గొడవ..
- 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట... దాడి
- కాంగ్రెస్ కార్యకర్తల పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ..
- 14 వార్డులో ఉద్రిక్త పరిస్థితి.. భారీగా చేరుకున్న పోలీసులు.
- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థి భర్త అరవింద్ పై అదే వార్డు స్వత్రంత అభ్యర్థి భర్త దాడి
- పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తన కు సంబంధించిన హాలులో దాడీ
- తనతో పాటు కారు డ్రైవర్,మునీమ్ పై దాడి
- ఏజెంట్ కు సంబంధించిన ఫారం లను వ్రాస్తున్న సమయంలో ఒక్క సరిగా వచ్చి దాడీ
- సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి వీడియోలు
- పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన అభ్యర్థి భర్త అరవింద్
గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే!
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. ఆరు రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ను ఆధారం చేసుకొని గెలుపు మాదంటే.. మాదేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఐదు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు తమకు కేటాయించిన పార్లమెంట్‌స్థానం పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, సీనియర్లంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అలాగే, బీజేపీ ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల పరిధిలో పోటాపోటీగా క్యాంపెయినింగ్ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని బట్టి ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సైతం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఫాంహౌస్కే పరిమితం కాగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ భారాన్నంతా మోశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
