టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఒమన్‌తో జరుగుతోన్న మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా శ్రీలంక యంగ్ బ్యాటర్ పవన్ రత్నాయక్, కెప్టెన్ దసునా షనక, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవన్ (60), షనక (50), మెండిస్ (61) ముగ్గురు అర్ధ సెంచరీలతో హోరెత్తించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన అతిథ్య శ్రీలంక బ్యాటర్లు అనామక ఒమన్ బౌలర్లపై విశ్వరూపం చూపించారు. ఓపెనర్లు నిశాంక (13), కమిల్ మిశ్రా (8) విఫలమైన.. పవన్ రత్నాయక్, కెప్టెన్ షనక, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ రఫ్పాడించారు.
ముగ్గురు హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించారు. పవన్ 28 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్ బాది 60 పరుగులు.. శనక 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 50 రన్స్ చేశారు. మెండిస్ 75 బంతుల్లో 7 ఫోర్ల సహయంతో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
చివర్లో కమిందు మెండిస్ (7 బంతుల్లో 19 పరుగులు) మెరుపులు మెరిపించాడు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2 వికెట్లు పడగొట్టాడు. సుఫ్యాన్ మెహమూద్, ఒడెడ్రా చెరో వికెట్ తీశారు.
