ఫేక్ డాక్యుమెంట్లతో భూ విక్రయానికి యత్నం.. నార్సింగి పోలీసుల అదుపులో నిందితులు

ఫేక్ డాక్యుమెంట్లతో భూ విక్రయానికి యత్నం.. నార్సింగి పోలీసుల అదుపులో నిందితులు

గండిపేట, వెలుగు: నార్సింగి పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధిలోని నార్సింగి గ్రామం బృందావన్ కాలనీలో ఉన్న విలువైన భూమిని నకిలీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మాకినేని శివశంకరప్రసాద్(74), మజ్జి నరేశ్(43), తెనాలికి చెందిన కమ్మెల శ్రీనివాసరావు(58), కూకట్​పల్లికి చెందిన నల్లం ఆదినారాయణ(60) నార్సింగిలో ఓ భూమిపై తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు.