ఉప్పల్, వెలుగు: ఓ విద్యార్థిని ఫోన్‌ను చోరీ చేసిన కేటుగాళ్లు ఆమె బ్యాంక్అకౌంట్ నుంచి రూ.2.99 లక్షలు కాజేశారు. ఉప్పల్ భరత్‌నగర్‌కు చెందిన బి.రేణుశ్రీ సెల్‌ఫోన్ కొన్ని రోజుల క్రితం చోరీకి గురైంది. అనంతరం ఆమె ఎస్‌బీఐ అకౌంట్నుంచి రూ.2,99,891 మాయమయ్యాయి. ఓటీపీ, బ్యాంక్వివరాలు ఎవరితోనూ పంచుకోలేదని ఆమె చెప్పింది. బాధితురాలు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజిగిరి సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
ఓటీపీలు రాలే.. రూ.2.32 లక్షలు ట్రాన్స్ఫర్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఉప్పల్ హిల్స్ కాలనీకి చెందిన మేళ రాధిక బ్యాంక్అకౌంట్నుంచి రూ.2.32 లక్షలు కాజేశారు. క్యాష్ డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్లో కేవలం రూ.16 వేలే ఉన్నట్లు చెప్పారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. స్టేట్‌మెంట్ పరిశీలించగా పలుమార్లు డబ్బు బదిలీ అయినట్లు తేలింది. అయితే, ఈ లావాదేవీలకు సంబంధించి తనకు ఎటువంటి ఓటీపీలు రాలేదని బాధితురాలు వాపోయారు. ఆదివారం మల్కాజిగిరి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
