‘కేబీఆర్’ వద్ద రెండోసారి వన్వే ట్రయల్ రన్,,ప్రయాణ దూరం స్వల్పంగా పెరుగుతుంది: సీపీ సజ్జనార్ 

‘కేబీఆర్’ వద్ద రెండోసారి వన్వే ట్రయల్ రన్,,ప్రయాణ దూరం స్వల్పంగా పెరుగుతుంది: సీపీ సజ్జనార్ 
  • చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టు, కేబీఆర్ మధ్య 150 మీటర్ల ఇంటర్ చేంజ్ ఏర్పాటు చేస్తాం: ట్రాఫిక్ జాయింట్ సీపీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రెండోసారి వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ట్రయల్ రన్ చేపట్టారు. ఈ ట్రయల్ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీపీ సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. సజ్జనార్ మాట్లాడుతూ ఏప్రిల్ 5న రెండు గంటల పాటు మొదటి ట్రయల్ రన్ నిర్వహించామని, అప్పుడు గమనించిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే వల్ల ప్రయాణ దూరం స్వల్పంగా పెరుగుతుందన్నారు.

రోడ్లపై పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సివిల్ పనులను త్వరగా ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ రూట్​లో ఉన్న దవాఖానలతో కో ఆర్డినేషన్​చేసుకుంటూ అంబులెన్సుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ఏర్పాట్లు చేస్తామన్నారు. ట్రయల్ రన్ వేళ వాహనాలు లైన్లు మారేప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తించామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

వాహనాలు సులభంగా లైన్లు మారడానికి వీలుగా చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టు, - కేబీఆర్ పార్కు మధ్య 150 మీటర్ల ఇంటర్ చేంజ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నడిచేవాళ్లు సురక్షితంగా రోడ్డు దాటేందుకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టు, కేబీఆర్ పార్కు వద్ద పెడెస్ట్రియన్ సిగ్నళ్ల ఏర్పాటుపై నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం డ్రోన్ల ద్వారా ఈ జంక్షన్లలో ట్రాఫిక్ విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. పూర్తిస్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతే ఇక్కడ శాశ్వత మార్పులు చేపడతామని స్పష్టం చేశారు. డీసీపీ కాజల్, ఐపీఎస్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ  రమణా రెడ్డి పాల్గొన్నారు.