కామారెడ్డిలో 387 కిలోలు సీజ్.. పనసపండ్ల వ్యాన్ లో అక్రమంగా తరలింపు

కామారెడ్డిలో 387 కిలోలు సీజ్.. పనసపండ్ల వ్యాన్ లో అక్రమంగా తరలింపు

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: పనస పండ్ల మాటున వ్యాన్‌‌‌‌లో అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 387 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.1.93 కోట్లు ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేశ్​ చంద్ర ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రలోని నాసిక్​కు గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్​ పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో శనివారం సాయంత్రం కామారెడ్డి మండలం క్యాంసపల్లి శివారులోని హైవేపై తనిఖీలు నిర్వహించారు. 

అనుమానాస్పదంగా వచ్చిన ఓ వ్యాన్‌‌‌‌ను పరిశీలించారు. పైభాగంలో పనస పండ్లు కనిపించేలా అమర్చి, వాటి కింద సంచుల్లో భారీగా గంజాయి దాచినట్లు గుర్తించారు. షేక్​ కరీముల్లా, గైని సుభాష్​, షేక్​ రహీంను అరెస్ట్ చేశారు.