యాక్సిడెంట్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు మృతి : మూడేళ్లల్లో ఫ్యామిలీ మొత్తం చిన్నాభిన్నం

యాక్సిడెంట్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు మృతి : మూడేళ్లల్లో ఫ్యామిలీ మొత్తం చిన్నాభిన్నం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం. ఇక్కడ చనిపోయింది ఎవరో తెలుసా.. చనిపోయిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్. అతనితోపాటు అతని స్నేహితుడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ నుంచి ఝాన్సీ వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు ఐదుగురు పిల్లలు. ఇందులో ఒకరు పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. మరో కుమారుడు అలీ అహ్మద్ హత్య కేసులో జైలులో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం అలీ అహ్మద్ ను ఝాన్సీ జైలుకు మార్చారు. 

తన అన్న అలీ అహ్మద్ ను జైలులో కలిసేందుకు.. ప్రయాగ్ రాజ్ నుంచి బయలుదేరాడు అబాన్ అహ్మద్. అతనితోపాటు మరో నలుగురు కారులో బయలుదేరారు. కారు ఝాన్సీలోని పూంచ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగానే.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అబాన్ అహ్మద్, అతని స్నేహితుడు స్పాట్ లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

►ALSO READ | పగోళ్లకూ ఈ పరిస్థితి వద్దు : తప్పుగా ఇంజెక్షన్ ఇచ్చిన ఆస్పత్రి.. చెయ్యి కోల్పోయిన 20 ఏళ్ల యువతి..!

అబాన్ అహ్మద్ వయస్సు 20 ఏళ్లు అని చెబుతున్నారు పోలీసులు. యూపీలో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో అబాన్ అహ్మద్, అతని మరో తమ్ముడు అజమ్ అహ్మద్ మైనర్లు కావటంతో.. వాళ్లను బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. 2023లో వీళ్లిద్దరినీ విడుదలు చేస్తూ.. వాళ్లకు అత్తకు అప్పగించారు. 

అప్పటి నుంచి అబాన్ పెద్దన్న అలీ అహ్మద్ జైలులోనే ఉన్నాడు. ఇటీవల ఝాన్సీ జైలుకు తరలించారు. జైలులో అన్నయ్యను చూసేందుకు వెళుతున్న అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 

అతీక్ అహ్మద్ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంది : 

ఒకప్పుడు రాజులా బతికిన కుటుంబం.. వాళ్లు చెప్పిందే వేదం.. శాసనం. 2023 తర్వాత వీళ్ల ఫ్యామిలీ కనుమరుగు అవుతూ వచ్చింది. 
మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అయిన అతీక్ అహ్మద్ దుండగుల కాల్పుల్లో చనిపోయాడు.
పెద్ద కుమారుడు అసద్ అహ్మద్ 2023లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
రెండో కుమారుడు అలీ అహ్మద్ ఝూన్సీ జైలులో ఉన్నాడు. అతనిపై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 

మూడో కుమారుడు ఉమర్ అహ్మద్ లక్నో జైలులో ఉన్నాడు. అతనిపై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
నాలుగో కుమారుడు అబాన్ అహ్మద్ ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఐదో కుమారుడు అజమ్ అహ్మద్ బయటే ఉన్నాడు. చదువుకుంటున్నాడు.

అతీక్ అహ్మద్ భార్య పర్వీన్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆమెను పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు పోలీసులు.