స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం : మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హీరో కావటం ఖాయం..!

స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం : మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హీరో కావటం ఖాయం..!

నిన్నటి వరకు కుర్రకారు తఢాకా ఎలా ఉంటుందో చూపించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో జనంలోకి వస్తుంది. అదేంటో తెలుసా.. క్యా బోల్తీ పబ్లిక్.. జనం ఏం అనుకుంటున్నారు.. జనం ఏం చెబుతున్నారు.. క్యా బోల్తీ పబ్లిక్ అనే నినాదంతో.. దేశ వ్యాప్తంగా జనంలోకి వచ్చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలో స్కూల్స్, కాలేజీల పరిస్ధితి ఏంటీ.. స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి.. కోచింగ్ సెంటర్ల దందా ఏంటీ.. కాలేజీల్లో ఫీజుల వసూళ్ల సంగతి ఏంటీ.. విద్యా వ్యవస్థ ఎలా ఉంది.. ఎలాంటి సంస్కరణలు జరుగుతున్నాయి.. వాటి ఫలితాలు ఏంటీ.. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఏం కోరుకుంటున్నారు.. వాళ్లు చెప్పాలనుకుంటున్నది ఏంటీ.. వాళ్ల బాధలు ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదా.. ఇలాంటి విషయాలపై క్యా బోల్తీ పబ్లిక్ నినాదంతో.. దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ అతి పెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది. 

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ తర్వాత టార్గెట్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, స్కూల్ ఫీజులు అని వెల్లడించారాయన. దేశంలో చదువు అందుబాటులో లేకుండా పోయింది.. ఒకటో తరగతి పిల్లగాడి ఫీజు లక్ష రూపాయలు ఏంటీ.. మధ్య తరగతి ప్రజలు, పేద కుటుంబాలు ఇంత ఫీజులు భరించగలవా అని ప్రశ్నించారాయన. 

ALSO READ : తిరుగుబాటు మొదలైంది

ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు లక్షలకు లక్షల ఫీజులు ఎలా భరించగలరు.. ఆ కుటుంబాలు డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి.. ఇలాంటి ప్రశ్నలతో జనంలోకి వెళ్లి.. తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే. 

స్కూల్, కాలేజీ ఫీజులు భారీగా పెరగటంతో.. కోచింగ్ సెంటర్లలో ఇష్టానుసారం దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించిన దీప్కే.. పిల్లల చదువు కోసమే కుటుంబాల్లో అప్పుల్లో కూరుకుపోతున్నాయని.. తల్లిదండ్రులకు పిల్లల చదువు భారంగా మారిందని.. దేశంలో ఇలాంటి పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అభిజీత్ దీప్కే. 

విద్య అనేది ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెబుతుంది.. అలాంటి హక్కు కొన్నేళ్లుగా వ్యాపారంగా మారింది.. ఇది మారాలి.. మారి తీరాలి.. అందుకే క్యా బోల్తీ పబ్లిక్ నినాదంతో జనంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే.