ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (MSG) ప్రాతినిధ్యం వహిస్తున్న జోస్ బట్లర్... వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఏకంగా 66 సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో బట్లర్ మొత్తం టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును బ్రేక్ చేసి, అత్యధిక పరుగులు సాధించిన నంబర్-వన్ బ్యాటర్‌గా (14,833 పరుగులు) అవతరించాడు. అంతకుముందు క్రిస్ గేల్ రికార్డును సైతం వెనక్కి నెట్టి జోస్ ఈ శిఖరానికి చేరుకున్నాడు.
►ALSO READ | ఢిల్లీలో హసీనా ప్రెస్ మీట్.. బంగ్లాలో షకీబుల్ హసన్ ఇంటిపై బాంబుల దాడి
ఈ చారిత్రక మైలురాయిపై స్పందిస్తూ...ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం. ఎవరో ఒకరోజు ఈ రికార్డును బ్రేక్ చేస్తారు, బహుశా ఆ పేరు వైభవ్ సూర్యవంశీ కావొచ్చు అంటూ టీమిండియా యువ సంచలనం గురించి బట్లర్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. కొద్దికాలం పాటు ఫామ్ లేమితో ఇబ్బంది పడిన జోస్ బట్లర్, ఇప్పుడు తనదైన శైలిలో కంబ్యాక్ ఇచ్చి ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు
