థాయ్ లాండ్ లో ఘోరం జరిగింది. ఫుట్ బాల్ ఆడుతున్న ఆటగాళ్లపై పిడుగు పడింది. దీంతో ఓ ఫుట్ బాల్ ప్లేయర్ స్పాట్ లోనే చనిపోయారు. మరో 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. థాయ్ లోని నరాతివాత్ ప్రావిన్స్ లోని శాంటిపాప్ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థాయ్ లాండ్ లోని నరాతివాత్ ప్రావిన్స్‌లోని శాంటిపాప్ స్టేడియంలో బుధవారం ఉదయం ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల సోఫన్ అవేయ్ అనే ప్లేయర్ పై పిడుగుపడటంతో స్పాట్ లో చనిపోయాడు. మరో 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అనుకోని ఈ సంఘటనతో ప్లేయర్లు, ప్రేక్షకులు షాక్ గురయ్యారు.
Tragedy in Thailand: A football player was killed and 12 others injured after lightning struck the field during a match.
— fork (@forkonfomo) August 6, 2026
A heartbreaking reminder of the dangers of severe weather during outdoor events. 🕊️ pic.twitter.com/JDVknmCuhJ
