Varanasi: రాజమౌళి కఠిన భద్రతకు మరోసారి గండి.. ‘వారణాసి’ నుంచి మహేష్ యాక్షన్ సీన్ లీక్!

Varanasi: రాజమౌళి కఠిన భద్రతకు మరోసారి గండి.. ‘వారణాసి’ నుంచి మహేష్ యాక్షన్ సీన్ లీక్!

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ  ‘వారాణసి’ (VARANASI). దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై అతి భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ మూవీకి సంబంధించిన వరుస లీకులు జక్కన్నకు పెద్ద తలనొప్పిగా మారాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన కీలక దృశ్యాలు సోషల్ మీడియాలోకి రావడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

మరోసారి వారణాసి షెడ్యూల్ లీక్..

ప్రస్తుతం వారణాసి (కాశీ) నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ సెట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైవీపరీతంగా వైరల్‌గా మారింది. లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు గాయాలతో కనిపించడంతో పాటు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ అనంతరం ఆయన కొలనులోకి నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. 

ఫ్యాన్స్ ఆవేదన..

వారణాసి సినిమాపై అంచనాలను, థ్రిల్‌ను దెబ్బతీసేలా ఇలా వరుసగా లీకులు చేయడంపై మహేష్ బాబు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఇలా లీకులు చేసి సినిమా చూసే ఆసక్తిని పోగొట్టకండి" అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఉన్న ఉత్కంఠను, థ్రిల్‌ను దెబ్బతీసేలా వరుసగా షూటింగ్ దృశ్యాలు లీక్ అవుతుండటంపై జక్కన్నను ట్యాగ్ చేస్తూ మరింత భద్రత పెంచండి సార్ అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. 

మరింత కఠినం కానున్న భద్రత..

మొదటినుంచీ రాజమౌళి తన సినిమాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తూ, సెట్స్‌లోకి మొబైల్ ఫోన్లను సైతం అనుమతించకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ లీకులు పునరావృతం కావడంతో.. షూటింగ్ ప్రదేశం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అనూహ్య పరిణామాలతో జక్కన్నతో పాటు 'వారణాసి' చిత్ర యూనిట్ షాక్‌లో ఉంది.

ALSO READ : Jiya Shankar: ప్రియుడితో బిగ్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్..

భారీ కాన్సెప్ట్‌తో రాజమౌళి–మహేష్ బాబు మూవీ:
 
వారాణసి మూవీ గ్లోబ్-ట్రాటింగ్ టైమ్-ట్రావెల్ మైథికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. పవిత్ర నగరమైన వారణాసిపై పడబోయే ఓ భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) ముప్పు చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు శివభక్తుడైన 'రుద్ర' అనే పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో రామాయణానికి సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉంటాయని జక్కన్న గతంలోనే వెల్లడించారు. ఆ సన్నివేశాల్లో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో కనిపిస్తారని, ఆ లుక్‌ను చూసినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని కూడా రాజమౌళి చెప్పుకొచ్చారు. 

ఇకపోతే, ఈ చిత్రం సుమారు రూ.1,300–1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా, 1.43:1 IMAX ఫార్మాట్‌లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి నాన్-ఇంగ్లీష్ సినిమాగా కూడా ఈ ప్రాజెక్ట్ నిలవనున్నట్లు సమాచారం.