కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్: తొలి రౌండ్‌లో తన్వీ శర్మ బోణీ

కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్: తొలి రౌండ్‌లో తన్వీ శర్మ బోణీ

అసన్‌‌‌‌‌‌‌‌ (కొరియా): ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ తన్వీ శర్మ.. కొరియా మాస్టర్‌‌‌‌‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ తన్వీ 21–16, 21–15తో యువాన్‌‌‌‌‌‌‌‌ అన్‌‌‌‌‌‌‌‌ క్వి (చైనా)పై గెలిచింది. బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలతో చెలరేగిన ఇండియా ప్లేయర్‌‌‌‌‌‌‌‌ 36 నిమిషాల్లోనే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ముగించింది.  

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో  రష్మిక సంతోష్‌‌‌‌‌‌‌‌ 22–24, 21–12, 21–13తో యు ఎ ఈయెన్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై, మాన్సి సింగ్‌‌‌‌‌‌‌‌ 14–21, 21–19, 21–9తో కిమ్‌‌‌‌‌‌‌‌ జి యున్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై, ఇషారాణి 21–18, 15–21, 21–7తో లీ సో యుల్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై, అష్మితా చాలియా 22–20, 21–18తో రిరినా హిరామోటో (జపాన్‌‌‌‌‌‌‌‌)పై  గెలవగా, తన్యా హేమంత్‌‌‌‌‌‌‌‌ 16–21, 20–22తో హినా అకాచీ (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌ 22–20, 21–23, 3–21తో కిమ్‌‌‌‌‌‌‌‌ మిన్‌‌‌‌‌‌‌‌ జి (కొరియా) చేతిలో ఓడారు. విమెన్ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సోనాలీ సింగ్‌‌‌‌‌‌‌‌–రితికా థాకర్‌‌‌‌‌‌‌‌ 13–21, 21–15, 21–12తో బాంగ్ జి సన్‌‌‌‌‌‌‌‌–హుయాన్‌‌‌‌‌‌‌‌ జి జాంగ్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై నెగ్గారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో తరుణ్‌‌‌‌‌‌‌‌ మానేపల్లి 13–21, 21–12, 19–21తో యు టి బిన్‌‌‌‌‌‌‌‌ (కొరియా) చేతిలో, రౌనక్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ 21–23, 19–21తో జియోన్‌‌‌‌‌‌‌‌ హోయెక్‌‌‌‌‌‌‌‌ జి (కొరియా) చేతిలో, కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ 15–21, 9–21తో పార్క్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ యాంగ్‌‌‌‌‌‌‌‌ (కొరియా) చేతిలో,  కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 20–22, 21–14, 12–21తో డానిల్‌‌‌‌‌‌‌‌ డుబోవెంకో (ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌) చేతిలో, మిథున్‌‌‌‌‌‌‌‌ మన్హాస్‌‌‌‌‌‌‌‌ 11–21, 9–21తో జు జువాన్‌‌‌‌‌‌‌‌ చెన్‌‌‌‌‌‌‌‌ (చైనా) చేతిలో ఓడారు.