జ్యోతిష్యం: కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం.. గురుడు, సూర్యుడు, బుధుడు కలయిక.. నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..!

జ్యోతిష్యం: కర్కాటక రాశిలో  త్రిగ్రాహి యోగం..  గురుడు, సూర్యుడు, బుధుడు కలయిక.. నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశిలో సూర్యుడు, గురుడు, బుధుడు  కలవడం వలన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ  యోగం బుధవారం  (ఆగస్టు 12 ) రాత్రి7:58 గంటల నుంచి ఆగస్టు 17  వరకు ఉంటుంది. ఈ శుభ యోగం ప్రభావం వలన  వల్ల నాలుగు రాశుల (వృషభ, మిథున, కన్య, వృశ్చిక) వారికి  ఆర్థిక పరంగా అద్భతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.ఇప్పుడు ఆరాశుల గురించి తెలుసుకుందాం. . .!

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. బుధుడు వాక్చాతుర్యం, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు.కర్కాటక రాశిలోకి ఇప్పటికే సూర్యుడు, గురుడితో .. బుధుడు కలవడం వలన  త్రిగ్రాహి యోగానికి దారితీస్తుంది.ఈ యోగం ఆగస్టు 17 వరకు ఉంటుంది. . ఈ ప్రభావం వలన కొన్ని రాశుల వారు ( వృషభ రాశి, మిథున రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి) మాత్రం భారీగా లాభాలను పొందుతారు. 

వృషభ రాశి:  కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. .  ఇప్పటి వరకు ఏర్పడిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి.  కావలసిన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెడితే నాలుగు రెట్ల లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. నిరుద్యోగులకు అనుకూలమైన ప్రదేశంలో.. . ఆశించిన జాబ్​ లభిస్తుంది. 

మిథున రాశి: కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారు ధనలాభం పొందే అవకాశం ఉంది.  మీ మాటల తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఆర్థికపరంగా అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు  తొలగిపోతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వృత్తి.. వ్యాపారాలు కలసి వస్తాయి.  చేతి వృత్తుల వారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు రావడంతో పాటు.. కొత్త వెంచర్​లు ప్రారంభించే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు వేతనం పెరుగుతుంది.  కొత్త ఉద్యోగం లభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

కన్య రాశి: ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ రాశి వారు ఏ పని చేసినా బాగాలాభాలు పొందుతారు.  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలసమయమని పండితులు చెబుతున్నారు. ఉద్యోగ .. వ్యాపారస్తులు  ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడటంతో మనశ్శాంతి ఉంటుంది.  జీవిత భాగస్వామి సలహా..సూచనలను పాటించాలని పండితులు చెబుతున్నారు.  ఎప్పటి నుంచో పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ.. మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.  కాని ఏ విషయంలో కూడా ఎవరికి మధ్యవర్తిగాఉండవద్దు.. ఎలాంటి హామీల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

►ALSO READ | ఆధ్యాత్మికం : 12న చుక్కల అమావాస్య.. ఏడాదికి ఒక్కసారే వస్తది.. ఆ రోజు ఇలా చేస్తే దోషాలు పోతాయి..

వృశ్చిక రాశి:  ఈ రాశి త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి ఇది శుభ సమయం. విదేశీ ప్రయాణ అవకాశాలు కలుగుతాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ప్రయోజనాలను పొందవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. చేతి వృత్తి వారు .. వారు తమ వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ... ఉన్నతాధికారుల ప్రశంసలు అందడమే కాకుండా.. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి.  వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి.  ఆర్థికంగా బలపడతారు.  కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద త్రిగ్రహి యోగం ఈ రాశి వారికి కూడా భారీగా లాభాలను తీసుకొస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.